అమర జవాన్లకు ఘన నివాళి

ABN , First Publish Date - 2020-06-18T09:49:22+05:30 IST

దేశం కోసం చైనాతో పోరాడి ప్రాణాలర్పించిన 20 మంది వీర జవాన్‌ల సేవలు మరచిపోలేనివని బందరు నియోజక వర్గ జనసేన

అమర జవాన్లకు ఘన నివాళి

మచిలీపట్నం టౌన్‌, జూన్‌ 17 :  దేశం కోసం చైనాతో పోరాడి ప్రాణాలర్పించిన 20 మంది వీర జవాన్‌ల సేవలు మరచిపోలేనివని బందరు నియోజక వర్గ జనసేన కన్వీనర్‌ బండి రామకృష్ణ  నివాళులర్పి ంచారు.  బందరులో జరిగిన సంతాప సభలో ఆయన వీరజవాన్‌ సంతోష్‌బాబు చిత్రపటానికి నివాళు ర్పించారు. వీరజవాన్ల కుటుంబాలకు రూ.5 కోట్ల ఆర్థిక సాయం అందించాలని, కుటుంబ సభ్యులకు ఉద్యోగావకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు.  పార్టీ అధికార ప్రతినిధి లంకిశెట్టి బాలాజీ, గడ్డం రాజు, మైకేల్‌ తదితరులు పాల్గొన్నారు.


కైకలూరు : చైనా దాడుల్లో అమరుడైన కల్నల్‌ సంతోష్‌బాబుకు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. కైకలూరులో మండల టీడీపీ అధ్యక్షుడు పెన్మెత్స త్రినాథరాజు, మాజీ జడ్పీటీసీ సభ్యురాలు విజయలక్ష్మి, తెలుగు యువత ఉపాఽధ్యక్షుడు వీరాబత్తిన సుధ తదితరులు  పాల్గొన్నారు.

 

అవనిగడ్డ టౌన్‌ : అమరులైన  కల్నల్‌ సంతోష్‌ బాబుకు మండల ఆర్యవైశ్య సంఘం ఘన నివాళుల ర్పించింది. దేసు జగన్‌మోహనరావు, కూరపాటి వేణు, ఘంటసాల కన్నయ్య,  వేముల సుబ్రహ్మణ్యం, జ్ఞానేంద్ర గుప్తా, చన్నగిరి అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు.  సంతోష్‌ బాబు త్యాగం వృథా  పోదని  నాగాయలంక మండలం బర్రంకుల గ్రామానికి చెందిన రిటైర్డ్‌ నాయక్‌ వి.వి.పి.రావ్‌ అన్నారు. సైనికుల త్యాగాల వల్లే దేశంలో ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉండగలుగుతున్నారన్నారు. 

 

కల్నల్‌ కుటుంబానికి పరామర్శ

బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నోముల రఘు కల్నల్‌ సంతోష్‌ కుమార్‌ కుటుంబాన్ని  సూర్యాపేట వెళ్లి  పరామ ర్శిం చారు. వీరుడిని కన్న తల్లిదండ్రులకు శిరస్సు వచ్చి పాదాభి వందనం చేశారు. 

Updated Date - 2020-06-18T09:49:22+05:30 IST