-
-
Home » Andhra Pradesh » Krishna » 50 days
-
రోడ్డెక్కి 50 రోజులు
ABN , First Publish Date - 2020-05-13T09:24:22+05:30 IST
కర్ఫ్యూలు విధించినా.. అల్లర్లు జరిగినా.. ఆంక్షలు అమ లు చేసేది 10-15 రోజులు మాత్రమే. అలజడులు రేగిన ప్రాంతంలో ఆంక్షలను విధిస్తారు పోలీసులు. ఈ విధులు ఆ రోజులకు మాత్రమే ఉంటాయి.

పోలీసు చరిత్రలో తొలిసారి
ఆంధ్రజ్యోతి - విజయవాడ :
కర్ఫ్యూలు విధించినా.. అల్లర్లు జరిగినా.. ఆంక్షలు అమ లు చేసేది 10-15 రోజులు మాత్రమే. అలజడులు రేగిన ప్రాంతంలో ఆంక్షలను విధిస్తారు పోలీసులు. ఈ విధులు ఆ రోజులకు మాత్రమే ఉంటాయి. ఇప్పుడున్న లాక్‌డౌన్ ప్రతి పోలీసు ఉద్యోగి జీవితంలో చిరస్థాయిలో గుర్తుండి పోతుంది. లాక్‌డౌన్ విధులు నిర్వర్తించడానికి ఖాకీలు రోడ్డెక్కి నేటికి 50 రోజులు పూర్తవుతుంది. విజయవాడ పోలీసు కమిషనరేట్ పరిధిలో మొత్తం 4వేల మంది సిబ్బంది ఉన్నారు. వాళ్లంతా రేయింబవళ్లు కరోనా లాక్‌డౌన్ విధుల్లో తలమునకలవుతున్నారు. వారాంతపు సెలవులను రద్దు చేశారు. మూడు షిఫ్టులను రెండింటికి కుదించారు. ఉప కమిషనర్లు, అదనపు ఉప కమిషనర్లు, సహాయక కమిషనర్లు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, హెచ్‌సీ, పీసీలు, హోంగార్డులకు లాక్‌డౌన్ విధులు తప్ప మరో పని లేదు. మరో కేసు దర్యాప్తుపై దృష్టి సారించే పరిస్థితి అంత కన్నా లేదు. బైక్‌లపై తిరుగుతూ గల్లీల్లో సంచారాలకు అడ్డుకట్ట వేస్తున్నారు. సహచరులు కరోనాతో క్వారంటైన్‌కు వెళ్లినా మనోధైర్యంతో విధులను నిర్వర్తిస్తున్నారు.