-
-
Home » Andhra Pradesh » Krishna » 45000 carona cassess in krishna district
-
కరోనా - 45,000
ABN , First Publish Date - 2020-11-27T06:18:22+05:30 IST
కరోనా - 45,000

అధికారికంగా ఇప్పటివరకు మరణాల సంఖ్య 630
కొత్తగా 162 మందికి వైరస్
ఇద్దరు మృతి
115 మంది డిశ్చార్జి
విజయవాడ, ఆంధ్రజ్యోతి : జిల్లాలో కరోనా కేసులు 45వేలు దాటాయి. ఇప్పటివరకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన మరణాల సంఖ్య 630. రెండు నెలలుగా జిల్లాలో వైరస్ వ్యాప్తి కాస్త తగ్గినప్పటికీ ఇటీవల మళ్లీ క్రమంగా విస్తరించి విషం చిమ్ముతోంది. దీంతో రోజువారీ కేసులు పెరుగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా గురువారం 162 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు మృతిచెందారు. కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 45,052కు చేరాయి. బాధితుల్లో 115 మంది గురువారం డిశ్చార్జి అయ్యారు. ఇంకా 1,694 మంది చికిత్స పొందుతున్నారు.