వీరి అవసరం.. వారికి ఆదాయం

ABN , First Publish Date - 2020-06-26T17:06:55+05:30 IST

కరోనా కారణంగా నగరంలో మీ-సేవ కేంద్రాలు మూతపడడంతో ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకునే ప్రజలు ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల కోసం ప్రైవేటు ఈ-సేవ పాయింట్లు,

వీరి అవసరం.. వారికి ఆదాయం

రూ. 45 దరఖాస్తుకు రూ.200 నుంచి 500 వరకు వసూలు 

ధ్రువీకరణ పత్రం త్వరగా కావాలంటే 

రూ.1500 నుంచి రూ.2000 ఇవ్వాల్సిందే

పట్టించుకోని అధికారులు 


చిట్టినగర్‌(విజయవాడ) : కరోనా కారణంగా నగరంలో మీ-సేవ కేంద్రాలు మూతపడడంతో ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకునే ప్రజలు ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల కోసం ప్రైవేటు ఈ-సేవ పాయింట్లు, నెట్‌ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. వీరి అవసరాన్నే అవకాశంగా భావిస్తున్న ఆయా ప్రైవేటు సెంటర్ల నిర్వాహకులు అందినకాడికి దోచుకుంటున్నారు. కుల ధ్రువీకరణ పత్రం త్వరగా కావాలంటే రూ.1500 నుంచి రూ.2000 వరకు వసూలు చేస్తున్నారు. దరఖాస్తుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.45 వసూలు చేయాల్సి ఉండగా, రూ.200 నుంచి 500 వరకు వసూలు చేస్తున్నారు. నెట్‌ నిర్వాహకులైతే కుల ధ్రువీకరణ తామే చేయిస్తామని చెప్పి, మండల కార్యాలయ సిబ్బందితో ఉన్న సంబంధాలతో అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారు. వన్‌టౌన్‌లో ఇదే తంతు సాగుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Updated Date - 2020-06-26T17:06:55+05:30 IST