రైతుల త్యాగాలను గౌరవించాలి

ABN , First Publish Date - 2020-12-31T05:09:19+05:30 IST

రైతుల త్యాగాలను గౌరవించాలి

రైతుల త్యాగాలను గౌరవించాలి
వెలగపూడిలోని దీక్షా శిబిరంలో నినాదాలు చేస్తున్న రైతులు

379 రోజుకు చేరిన రాజధాని రైతుల ఆందోళనలు 

తుళ్లూరు/తాడికొండ/మంగళగిరి/తాడేపల్లి, డిసెంబరు 30 : రాజధాని అమరావతికి 33వేల ఎకరాలు ఇచ్చిన రైతుల త్యాగాలను పాలకులు గుర్తించి గౌరవించాలని పలువురు రైతులు కోరారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలంటూ చేపట్టిన ఉద్యమం బుధవారం 379వ రోజుకు చేరుకుంది. తుళ్లూరు, పెదపరిమి, అనంతవరం, నెక్కల్లు, బోరుపాలెం, దొండపాడు, అబ్బురాజుపాలెం, రాయపూడి, లింగాయపాలెం, ఉద్దండరాయునిపాలెం, వెలగపూడి, మందడం, ఐనవోలు, తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడక, మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, యర్రబాలెం, నవులూరు, బేతపూడి, నిడమర్రు, నీరుకొండ, తాడేపల్లి మండలం పెనుమాక గ్రామాల్లో రైతులు దీక్షలు కొనసాగించారు. ప్రత్యేక హోదా సాధన కమిటీ అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ బుఽధవారం రాజధాని గ్రామాల్లో పర్యటించి రైతులకు మద్దతు పలికారు. కాగా, అమరావతికి చెందిన మరో రైతు ఆవేదనతో మృతిచెందారు. మందడంకు చెందిన రామారావు (80) అమరావతి నిర్మాణానికి 20 ఎకరాలు ఇచ్చారు. రాజధాని తరలిపోతుందని కొంతకాలంగా బాధ పడుతున్నారని, ఆ దిగులుతోనే మృతి చెందారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

Updated Date - 2020-12-31T05:09:19+05:30 IST