-
-
Home » Andhra Pradesh » Krishna » 365 days continuous cricket matches
-
ఇక 365 రోజులూ క్రికెట్ మ్యాచ్‌లు : కేడీసీఏ
ABN , First Publish Date - 2020-12-15T05:46:59+05:30 IST
ఇక 365 రోజులూ క్రికెట్ మ్యాచ్‌లు : కేడీసీఏ

విజయవాడ, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో 365 రోజులూ క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని కేడీసీఏ (కృష్ణా జిల్లా క్రికెట్ అసోసియేషన్) స్పష్టం చేసింది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోని కేడీసీఏ కార్యాలయంలో సంఘ అధ్యక్షుడు ఇళ్ల శ్రీనివాస్ సోమవారం మీడియాతో మాట్లాడారు. మూలపాడు స్టేడియంలో ఉన్న రెండు గ్రౌండ్లలో ఒక దాన్ని ఏసీఏ (ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్).. కేడీసీఏకు కేటాయించిందని తెలిపారు. లోధా కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయడానికి కేడీసీఏ కృషి చేస్తోందన్నారు. జిల్లాలో మహిళా క్రికెట్ జట్టును తయారు చేస్తామన్నారు. గ్రామీణ స్థాయిలో ఉన్న క్రీడాకారులను గుర్తించి జాతీయ క్రీడా మైదానాల్లో ఆడేలా తర్ఫీదు ఇస్తామని చెప్పారు. ఆయా ప్రాంగణాల్లో సదుపాయాలను కల్పించడానికి కృషి చేస్తామన్నారు.
నూతన కార్యవర్గం ఎన్నిక
కేడీసీఏ నూతన కార్యవర్గం సోమవారం ఎన్నికైంది. అధ్యక్షుడిగా ఇళ్ల శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడిగా పి.బాజీ షరీఫ్‌ఖాన్ ఎన్నికయ్యారు. కార్యదర్శిగా ఎం.రవీంద్ర చౌదరి, సంయుక్త కార్యదర్శిగా ఎ.శ్రీధర్, కోశాధికారిగా జీఎన్ శ్రీనివాసరావు, కౌన్సిలర్‌గా డి.ప్రవీణ్ ఎన్నికయ్యారు.