బైపాస్‌ అభివృద్ధికి రూ.17.50 కోట్లు

ABN , First Publish Date - 2020-08-20T10:57:33+05:30 IST

గోతులమయంగా ఉన్న మచిలీపట్నం బైపాస్‌ అభివృద్ధికి రూ. 17.50 కోట్లు మంజూరయ్యాయని, పనులు వేగంగా పూర్తి చేయాలని ఆర్‌ అండ్‌ బీ ఈ

బైపాస్‌ అభివృద్ధికి రూ.17.50 కోట్లు

మచిలీపట్నం టౌన్‌ : గోతులమయంగా ఉన్న మచిలీపట్నం బైపాస్‌ అభివృద్ధికి రూ. 17.50 కోట్లు మంజూరయ్యాయని,  పనులు వేగంగా పూర్తి చేయాలని ఆర్‌ అండ్‌ బీ ఈఈ ఎం.శ్రీనివాసరావును కలెక్టర్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని చాంబర్‌లో బైపాస్‌ పనులపై కలెక్టర్‌ చర్చించారు. మూడుస్తంభాల సెంటర్‌ నుంచి పెడన రోడ్డు, నోబుల్‌ రోడ్డు పనులు పూర్తి చేయాలన్నారు.


వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టాలన్నారు. నాగాయలంక మండలం టి.కొత్తపాలెం నుంచి గుల్లలమోద వరకు ఇటీవల పర్యటించిన సమయంలో రోడ్డు దుస్థితిని ప్రజలు వివరించారని,  దీనిపై రూ.65 లక్షలతో అంచనా వేసి నిధులు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుం టున్నామన్నారు.

Read more