-
-
Home » Andhra Pradesh » Krishna » 13041 cases
-
13,041 కేసులు
ABN , First Publish Date - 2020-08-20T10:51:23+05:30 IST
జిల్లాలో కరోనా కేసులు 13వేలు దాటాయి. మార్చి నుంచి మొన్నటి వరకు కల్లోలం సృష్టించిన మహమ్మారి పది రోజులుగా కాస్త నె

ఆంధ్రజ్యోతి, విజయవాడ : జిల్లాలో కరోనా కేసులు 13వేలు దాటాయి. మార్చి నుంచి మొన్నటి వరకు కల్లోలం సృష్టించిన మహమ్మారి పది రోజులుగా కాస్త నెమ్మదించడంతో జిల్లాలో వైరస్ వ్యాప్తి నిలకడగానే సాగుతోంది. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 281 మంది వైరస్ బారిన పడ్డారు.
కొవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో ముగ్గురు మృతి చెందారు. దీంతో జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 13,041కు చేరగా, మరణాల సంఖ్య అధికారికంగా 235కు పెరిగింది. పాజిటివ్ బాధితుల్లో 505 మంది వ్యాధి నుంచి కోలుకుని ఇంటికి చేరుకోగా, ఇంకా 2,636 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.