జనవరి 5 నుంచి వైవీయూ పీజీ కౌన్సెలింగ్‌

ABN , First Publish Date - 2020-12-29T04:57:41+05:30 IST

వైవీ యూనివర్శిటీ అనుబంధ పీజీ కళాశాలలో పోస్టుగ్రాడ్యుయేషన్‌ కౌన్సెలింగ్‌ జనవరి 5 నుంచి జరుగుతుందని డీవోఏ డైరెక్టర్‌ గంగయ్య తెలిపారు.

జనవరి 5 నుంచి వైవీయూ పీజీ కౌన్సెలింగ్‌

6న వెబ్‌ ఆప్షన్లు - 16న సీట్ల కేటాయింపు


కడప(వైవీయూ), డిసెంబరు 28: వైవీ యూనివర్శిటీ అనుబంధ పీజీ కళాశాలలో పోస్టుగ్రాడ్యుయేషన్‌ కౌన్సెలింగ్‌ జనవరి 5 నుంచి జరుగుతుందని డీవోఏ డైరెక్టర్‌ గంగయ్య తెలిపారు. 6వ తేదీ నుంచి కళాశాలలకు వెబ్‌ ఆప్షన్లు మొదలవుతాయని 16వ తేదీ విద్యార్థులకు సీట్లు కేటాయింపు జరుగుతుందన్నారు. 17 నంచి 21వ తేదీ వరకు విద్యార్థులు ట్యూషన్‌ ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాలన్నారు. 18 నుంచి 21 వరకు కళాశాలలో విద్యార్థులు చేరేలా షెడ్యూలు రూపకల్పన చేశామన్నారు. వైవీయూ సెట్‌  2020కి హాజరైన విద్యార్థుల్లో అన్ని ర్యాంకర్ల అర్హత పత్రాల  పరిశీలనకు నిర్ణయించిన తేదీల్లో హాజరు కావాలని కోరారు. జనవరి 5న ఉదయం 9 నుంచి ఒంటి గంట వరకు బాటనీ, జువాలజీ, తెలుగు, ఉర్దూ సబ్జెక్టులకు హాజరు కావాలన్నారు. అదే రోజు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు కంప్యూటర్‌ సైన్స్‌, ఇంగ్లీషు, జువాలజీ, పీజీ, డిప్లమా ఇన్‌ థియేటర్‌ ఆర్ట్స్‌, ఫైనాట్స్‌ ఫుడ్‌ టెకాలజీ విద్యార్థులు హాజరుకావాలన్నారు. 6వ తేదీ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కామర్స్‌ విద్యా ర్థులు హాజరుకావాలని సూచించారు. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు మెటీరియల్‌ సైన్స్‌, లైఫ్‌సైన్స్‌, అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీ కోర్సు విద్యార్థులు హాజరుకావాలన్నారు. 7వ తేదీ ఉదయం 9 నుంచి ఒంటి గంట వరకు మ్యాథ్స్‌ జనరల్‌టెస్ట్‌ రాసిన విద్యార్థులు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు కెమిస్ట్రీ, పర్యావరణం, ఎకనామిక్స్‌ విద్యార్థులు హాజరుకావాలన్నారు. 8వ  తేదీ ఉదయం 9 నుంచి ఒంటి గంట వరకు ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అన్ని ర్యాంకుల విద్యార్థులు హాజరు కావాలన్నారు. ఏదైనా ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా 5 నుంచి 7వ తేదీ వరకు జరిగే అర్హత పత్రాల పరిశీలనకు రానివారు 8వ తేదీ మధ్యాహ్నం రెండు నుంచి హాజరు కావాలన్నారు. వైవీసెట్‌, ర్యాంకు కార్డు, హాల్‌టిక్కెట్‌, డిగ్రీ మార్కుల జాబితా, ప్రొవిజినల్‌ సర్టిఫికెట్లు, 10వ తరగతి, ఇంటర్మీడియట్‌ మార్కులిస్టు, స్టడీ సర్టిఫికెట్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కుల ఆదాయ సర్టిఫికెట్లు వెంట తెచ్చుకోవాలన్నారు. ఇతర రాష్ట్రాల్లో ప్రైవేటు స్టడీ చదివిన వారు రెసిడెన్సీ సర్టిఫికెట్‌ తెచ్చుకోవాలన్నారు.

Updated Date - 2020-12-29T04:57:41+05:30 IST