వైవీయూ డిగ్రీ సెమిస్టర్‌ ఫలితాలు విడుదల

ABN , First Publish Date - 2020-02-07T06:17:56+05:30 IST

యోగివేమన విశ్వవిద్యాలయం అనుబంధ డిగ్రీ కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న మొదటి, మూడవ, ఐదవ డి గ్రీ సెమిస్టరు ఫలితాలను వీసీ సూర్య కళావతి తన

వైవీయూ డిగ్రీ సెమిస్టర్‌ ఫలితాలు విడుదల

ఉత్తీర్ణతా శాతం పెరుగుదల
విత్‌ హెల్డ్‌లో బీకాం కంప్యూటర్‌ పరీక్ష పత్రాలు : వీసీ సూర్యకళావతి
 
యోగివేమన విశ్వవిద్యాలయం అనుబంధ డిగ్రీ కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న మొదటి, మూడవ, ఐదవ డి గ్రీ సెమిస్టరు ఫలితాలను వీసీ సూర్య కళావతి తన ఛాంబరులో గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ జిల్లాలో గత అక్టోబరు, నవంబరు నెలల్లో సెమిస్టరు ప రీక్షలు జరిగాయియని, వైవీయూ అనుబంధం గా 88 కళాశాలల నుంచి 30,514 మంది వి ద్యార్థులు పరీక్షలు రాశారన్నారు. సీఈ ప్రొఫెసర్‌ పద్మ మాట్లాడుతూ పరీక్ష ఫలితాలను మొదటి సెమిస్టరు 12078 మంది విద్యార్థులు పరీక్షలు రాశారన్నారు. ఇందులో 4457 మంది ఉత్తీర్నత సాధించారన్నారు. మూడో సెమిస్టరు లో ఇందులో బీఏ 978 మందికి గాను 348 మంది, బీబీఏ 213 మందికి గాను 109 మంది, బీకాంలో 5219 మందికి గాను 1874 మంది, బీఎస్సీలో 5668 మందికి గాను 2126 మంది ఉ త్తీర్ణత సాధించారన్నారు.
 
మూడో సెమిస్టరులో 9282 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 5386 మంది విద్యార్థులు ఉత్తీర్నత పొందారన్నారు. 38.63 శాతం మంది ఉత్తీర్ణత పొందినట్లయిం ది. ఇందులో బీఏలో 604 మందికి 281 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. అలాగే ఈబీఏలో 121 మందికి గాను 66 మంది, బీకాంలో 3882 మంది పరీక్షలు రాయగా, 1054 మంది ఉత్తీర్ణ త సాధించారు. బీఎస్సీలో 4675 మందికి గాను 2185 మంది ఉత్తీర్నత సాధించారు. 5వ సెమిస్టరులో 9154 మంది పరీక్షలు రాయగా 3691 మంది ఉత్తీర్ణత సాధించారు. అంటే 41.32 శా తం ఉత్తీర్ణత పొందినట్లయింది. బీఏలో 5378 మంది పరీక్షలు రాయగా 437 మంది ఉత్తీర్ణత సాఽఽధించారు. అత్యధికంగా ఈ గ్రూపులో 81.38 శాతం ఉత్తీర్ణత పొందారు.
 
అలాగే బీబీఏలో 128 మందికి గాను 88 మంది ఉత్తీర్ణత సాధించారు. బీకాంలో 3855 మందికి గాను 1210 మంది ఉత్తీర్ణులయ్యారు. బీఎస్సీలో 4634 మం ది పరీక్షలు రాయగా 1956 మంది ఉత్తీర్ణత పొందారు. బీకాం కంప్యూటర్స్‌ పరీక్ష ఫలితాలు విత్‌హెల్డ్‌లో ఉంచినట్లు వైవీయూ కంట్రోల్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ అధికారి ప్రొఫెసర్‌ పద్మ వె ల్లడించారు. బీకాం కంప్యూటర్స్‌ ఆంగ్ల మాధ్య మం విద్యార్థులు తెలుగు మాధ్యమంలో పరీక్షలు రాస్తున్నందు వల్ల ఈ ఫలితాలు విత్‌హెల్డ్‌లో ఉంచినట్లు ఆమె తెలిపారు. పలుమార్లు కళాశాలల యాజామాన్యాలకు సూచించినా మార్పు రానందు వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
 
భవిష్యత్తులో ఆంగ్ల మధ్యమంలోనే బీకాం విద్యార్థులు పరీక్షలు రాసేలా ఖచ్చితమై న హామీ ఇస్తేనే తరువాత ఫలితాలు విడుదల చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెక్టార్‌ రామకృష్ణారెడ్డి, రిజిస్ట్రార్‌ విజయరాఘవ ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-02-07T06:17:56+05:30 IST