వైవీయూ డిగ్రీ పరీక్ష ఫలితాలు విడుదల
ABN , First Publish Date - 2020-12-23T05:17:45+05:30 IST
యోగివేమన యూనివర్శిటీ డిగ్రీ రెండవ, 4వ సెమిస్టర్ ఫలితాలను వీసీ సూర్యకళావతి, రిజిస్ట్రార్ విజయరాఘవప్రసాద్ మంగళవారం సాయంత్రం విడుదల చేశారు.
కడప(వైవీయూ), డిసెంబరు 22: యోగివేమన యూనివర్శిటీ డిగ్రీ రెండవ, 4వ సెమిస్టర్ ఫలితాలను వీసీ సూర్యకళావతి, రిజిస్ట్రార్ విజయరాఘవప్రసాద్ మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. ఈ సందర్బంగా వీసీ మాట్లాడుతూ కరోనా సమయంలో కూడా పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించి ఫలితాలను త్వరగా ఇవ్వడం పట్ల యూనివర్శిటీ సిబ్బందిని అభినందిస్తున్నానన్నారు. పరీక్షల నిర్వహణ అధికారి ప్రొఫెసర్ పద్మ పరీక్షల వివరాలను వెల్లడిస్తూ డిగ్రీ రెండవ సెమిస్టర్ బీఏ కోర్సులో 869 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 634 మంది విద్యార్థులు పాసయ్యారు. బీటీఏలో 200 మంది విద్యార్థులు పరీక్ష రాగా 114 మంది విద్యార్థులు పాసయ్యారు. బీకాంలో 4,797 మంది పరీక్షలు రాయగా 2,878 మంది విద్యార్థులు పాసయ్యారు. బీఎస్సీలో 5,338 మంది పరీక్షలు రాయగా 2,929 మంది పాసయ్యారు. డిగ్రీ నాలుగవ సెమిస్టర్ బీఏలో 580 మంది పరీక్ష రాయగా 488 మంది విద్యార్థులు పాసయ్యారు. బీటీఏలో 117 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 103 మంది పాసయ్యారు. బీకాంలో 3,741 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 2,400 మంది విద్యార్థులు పాసయ్యారు. బీఎస్సీలో 4,548 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 3,142 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. డిగ్రీ వాల్యూయేషన్ 6వ సెమిస్టర్ ఫలితాలను లా కోర్సుకు సంబంధించి 3వ, 5వ సెమిస్టర్ ఫలితాలను, లా అయిదేళ్ల కోర్సుకు సంబంధించి 3వ సెమిస్టర్, 5వ సెమిస్టర్, 7వ సెమిస్టర్, 9వ సెమిస్టర్ ఫలితాలను కూడా వీసీ విడుదల చేశారు. కార్యక్రమంలో పరీక్షల విభాగం సహాయ నిర్వహణ అధికారులు డాక్టర్ సుబ్బారెడ్డి, డాక్టర్ ఆదినారాయణరెడ్డి, డాక్టర్ సుమిత్రలు పాల్గొన్నారు.