8 నుంచి యువజనోత్సవాల ఎంపికలు

ABN , First Publish Date - 2020-11-26T04:52:15+05:30 IST

యువజనోత్సవాల్లో భాగంగా డిసెంబరు 8 నుండి 13వ తేదీ వరకు డీఎ్‌సఏ ప్రాంగణంలో జిల్లాలోని 15 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల వయస్సు మధ్య గల యువతకు ఎంపికలు నిర్వహిస్తున్నామని స్టెప్‌ సీఈవో రామచంద్రారెడ్డి తెలిపారు.

8 నుంచి యువజనోత్సవాల ఎంపికలు

కడప(నాగరాజుపేట), నవంబరు 25: యువజనోత్సవాల్లో భాగంగా డిసెంబరు 8 నుండి 13వ తేదీ వరకు డీఎ్‌సఏ ప్రాంగణంలో జిల్లాలోని 15 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల వయస్సు మధ్య గల యువతకు ఎంపికలు నిర్వహిస్తున్నామని స్టెప్‌ సీఈవో రామచంద్రారెడ్డి తెలిపారు. స్టెప్‌ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోటీలు జాతీయ, రాష్ట్రస్థాయిలో ఉంటాయన్నారు. రాష్ట్రస్థాయికి వక్తృత్వం, నృత్యం, పాటలు, వన్‌ఆర్ట్‌ప్లే, మిమిక్రీ, వెంట్రిలాట్రిజం, మ్యూజిక్‌ వంటి పోటీలు ఉంటాయన్నారు. అదేవిధంగా జాతీయస్థాయికి జానపద నృత్యం, జానపద గేయాలు, ఏకాంకి, శాస్త్రీయ సంగీతం, గాత్రం, వాయిద్యాల పోటీలు ఉంటాయన్నారు. పోటీల్లో పాల్గొనే అభ్యర్థులు తమ కళకు సంబందించి దృశ్య, శ్రవణ వీడియోలు సీడీలో రికార్డు చేసి డిసెంబరు 2వ తేదీలోపు స్టెప్‌ కార్యాలయానికి పంపాలన్నారు. న్యాయమూర్తులు సీడీలను పరిశీలించిన అనంతరం కళాకారులను ఎంపిక చేస్తామన్నారు. మరిన్ని వివరాలకు 9949298810, 9398209901, 9949537636 నెంబర్లను సంప్రదించాలన్నారు.

Read more