పెళ్లికానుక ఎప్పుడో?
ABN , First Publish Date - 2020-02-09T10:44:08+05:30 IST
నిరుపేదల కుటుంబాల్లో పెళ్లి చేసుకున్న జంటలకు అండగా గత ప్రభుత్వం చంద్రన్న పెళ్లికానుక అందించి ఆర్థికంగా ఆసరా కల్పించింది. ఆ పథకాన్ని
బద్వేలు, ఫిబ్రవరి 8: నిరుపేదల కుటుంబాల్లో పెళ్లి చేసుకున్న జంటలకు అండగా గత ప్రభుత్వం చంద్రన్న పెళ్లికానుక అందించి ఆర్థికంగా ఆసరా కల్పించింది. ఆ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం వైఎస్‌ఆర్ పెళ్లికానుకగా పేరు మార్చింది. అయితే ఈ పథకం కింద లబ్ధి కోసం దరఖాస్తు చేసుకున్న జంటలకు అందే సాయం నిలిచిపోవడంతో లబ్ధిదారులు నిరాశ చెందుతున్నారు. పెళ్లికానుక కోసం దరఖాస్తు చేసుకున్న నవ దంపతులకు ప్రస్తుత ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా వారి ఖాతాలో జమ చేయలేదు. గత ప్రభుత్వం పథకం ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు జిల్లా వ్యాప్తంగా 5981 మంది నవ దంపతులు పెళ్లికానుక కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఎన్నికల కోడ్‌కు ముందు గత ప్రభుత్వం 3,412 మందికి రూ.14.35 కోట్లు వారి ఖాతాల్లో జమ చేసింది. తరువాత అఽధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం దరఖాస్తు చేసుకున్న వారికి నిధులు మంజూరు చేయకపోవడంతో జిల్లా వ్యాప్తంగా 2,569 జంటలు పెళ్లికానుక సాయం కోసం ఎదురు చూస్తున్నారు.
లబ్ధి ఇలా..
వైఎస్‌ఆర్ పెళ్లికానుక పథకం కింద దరఖాస్తు చేసుకున్న పేదింటి యువతులకు ప్రభుత్వం ఎస్సీలకు రూ.40 వేలు, ఎస్సీ కులాంతర వివాహానికి రూ.75 వేలు, గిరిపుత్రులకు రూ.50 వేలు, ఎస్టీ కులాంతర వివాహనికి రూ.75 వేలు, బీసీలకు రూ.35 వేలు, బీసీ కులాంతర వివాహానికి రూ.50 వేలు, మైనార్టీలకు దుల్హన్ కింద రూ.50 వేలు, దివ్యాంగులకు రూ.లక్ష, భవన నిర్మాణ రంగంలోని కార్మికులకు రూ.20 వేలు ఆర్థిక సాయం అందిస్తుంది.
అందని ద్రాక్షలా...
వైఎస్‌ఆర్ పెళ్లికానుక లబ్ధిదారులకు అందని ద్రాక్షలా మారింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా చంద్రన్న పెళ్లికానుకగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేసి పేద నవ దంపతులకు ఆర్థికంగా అండగా నిలిచారు. ప్రస్తుతం ప్రభుత్వం ఈ పథకాన్ని వైఎస్‌ఆర్ పెళ్లికానుకగా పేరు మార్చి అమలు చేస్తోంది. పెళ్లికి 15 రోజుల ముందు వైఎస్‌ఆర్ పెళ్లికానుక కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పెళ్లి రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన యాప్‌తో పాటు 100కు కాల్ చేసి వివాహ తేదీ, వివరాలను తెలియచేయాలి. వాటిని సంబంఽధిత సిబ్బంది పరిశీలించి వారి వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు. సాఽధికారి సర్వేతో అనుసంధానం చేస్తారు. అవి సరిపోతే ప్రభుత ్వం వారి ఖాతాకు సాయం జమ చేస్తుంది. ఎన్నికల అనంతరం కొత్తగా రాష్ట్రంలో అఽధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాలో నిధులు జమ చేయలేదని వాపోతున్నారు.
ఇదీ జిల్లా పరిస్థితి...
నియోజకవర్గం దరఖాస్తులు లబ్ధిపొందినవారు ప్రభుత్వం చెల్లించిన మొత్తం
బద్వేలు 663 420 రూ.1.68 కోట్లు
జమ్మలమడుగు 754 442 రూ.1.30 కోట్లు
కమలాపురం 804 461 రూ.1.97 కోట్లు
రైల్వేకోడూరు 589 336 రూ.1.42 కోట్లు
మైదుకూరు 830 457 రూ.1.38 కోట్లు
ప్రొద్దుటూరు 512 244 రూ.1.03 కోట్లు
పులివెందుల 645 349 రూ.1.50 కోట్లు
రాజంపేట 583 342 రూ.1.44 కోట్లు
రాయచోటి 597 361 రూ.1.58 కోట్లు
మొత్తం 5,981 3,412 రూ.14.35 కోట్లు.
పెళ్లికానుక ఇంకా అందలేదు
11 నెలల క్రితం పెండ్లికానుక కోసం దరఖాస్తు చేసుకున్నాను. కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఇంతవరకు డబ్బులు అందలేదు. గత ఏడాది మార్చి నెలలో మా కుమార్తె వివాహానికి పెండ్లికానుక కోసం దరఖాస్తు చేసుకున్నాం. నిధులు మంజూరు కాలేదని అధికారులు చెబుతున్నారు. పెండ్లికానుక వస్తుందన్న నమ్మకంతో ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. ప్రజాప్రతినిదులు స్పందించి త్వరగా పెండ్లికానుక నిధులు విడుదల చేసి ఆదుకోవాలి.
దరఖాస్తు చేసుకున్న వారికి అందుతుంది
పెండ్లికానుకకు సంబంధించి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. నిధులు మంజూరు కాకపోవడంతో వైఎస్‌ఆర్ పెళ్లికానుక డబ్బులు ఇవ్వడం ఆలస్యమవుతోంది. నిధులు మంజూరు కాగానే దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు నేరుగా వారి బ్యాంక్ అకౌంట్‌లోనే డబ్బులు జమ అవుతాయి. దరఖాస్తుదారులు ఎవరూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.