ఆదినిమ్మాయపల్లె డ్యాం వద్ద యువకుడు గల్లంతు

ABN , First Publish Date - 2020-08-12T11:18:04+05:30 IST

మండల పరిధిలోని ఆదినిమ్మాయపల్లె డ్యాం వద్ద యువకుడు గల్లంతైనట్లు ఏఎ్‌సఐ మోహన్‌రావు తెలిపారు. పోలీసులు ఇచ్చిన సమాచారం

ఆదినిమ్మాయపల్లె డ్యాం వద్ద యువకుడు గల్లంతు

వల్లూరు, ఆగస్టు 11 : మండల పరిధిలోని ఆదినిమ్మాయపల్లె డ్యాం వద్ద యువకుడు గల్లంతైనట్లు ఏఎ్‌సఐ మోహన్‌రావు తెలిపారు. పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు కమలాపురానికి చెందిన రెడ్డయ్య (16) తన స్నేహితులతో కలిసి ఆదినిమ్మాయపల్లె వద్దకు సరదాగా గడపడానికి వచ్చి నీటిలో దిగి గల్లంతయ్యాడు.


స్థానిక గజ ఈతగాళ్లతో నీటిలో వెతికించామని, చీకటి పడడంతో ఇబ్బంది రావడంతో బయటికి వచ్చినట్లు తెలిపారు. బుధవారం ఉదయం గల్లంతైన యువకుడి కోసం వెదుకుతామని తెలిపారు.

Updated Date - 2020-08-12T11:18:04+05:30 IST