ఈతకెళ్లి యువకుడి మృతి

ABN , First Publish Date - 2020-12-18T05:06:15+05:30 IST

రెడ్డివారిపల్లె పంచాయితీ పరిధిలోని గుర్రప్పపాళెం గిరిజన కాలనీకి చెందిన తుపాకుల పెంచలయ్య(20) అనే యువకుడు ఈత కోసం వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు.

ఈతకెళ్లి యువకుడి మృతి
పెంచలయ్య మృతదేహం వద్ద విలపిస్తున్న కుటుంబ సభ్యులు

రైల్వేకోడూరు రూరల్‌, డిసెంబరు, 17:  రెడ్డివారిపల్లె పంచాయితీ పరిధిలోని గుర్రప్పపాళెం గిరిజన కాలనీకి చెందిన తుపాకుల పెంచలయ్య(20) అనే యువకుడు ఈత కోసం వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. అధికారుల వివరాల మేరకు... గుర్రప్పపాళెంకు చెందిన కొంత మంది యువకులు సరదాగా ఈత కోసం గుంజననదికి వెళ్లారు. ఈత ఆడు తుండగా పెంచలయ్య ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు నది వద్దకు చేరుకుని బోరున విలపించారు. సంఘటన గురించి తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే, విప్‌ కొరముట్ల శ్రీనివాసులు, తహసీల్దార్‌ శిరీషా, ఆర్‌ఐ సుశీల్‌కుమార్‌ తదితరులు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Updated Date - 2020-12-18T05:06:15+05:30 IST