-
-
Home » Andhra Pradesh » Kadapa » ycp mla rachamallu prasada reddy kadapa
-
సుబ్బయ్య హత్యపై ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ స్పందన
ABN , First Publish Date - 2020-12-30T17:43:47+05:30 IST
సుబ్బయ్య హత్యపై ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ స్పందన

కడప: టీడీపీ నేత సుబ్బయ్య హత్యపై ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచ మల్లు ప్రసాద్ రెడ్డి స్పందించారు. సుబ్బయ్య హత్యతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. హతుడు సుబ్బయ్య భార్య ఇచ్చిన ఫిర్యాదులో తమ పేర్లను ఇవ్వలేదని.. తమ ప్రోత్సాహంతో జరిగిందని ఆరోపిస్తోంది తప్ప తమ పేర్లను ఫిర్యాదులో పేర్కొనలేదని చెప్పారు. రవి, మరో నలుగురుపై ఫిర్యాదు చేయగా వారిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారన్నారు. రాజకీయాల్లో హత్యలు చేయడాన్ని పార్టీలకతీతంగా ఖండిస్తున్నానని ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి తెలిపారు.