వైసీపీ దౌర్జన్యానికి టీడీపీ కార్యకర్త బలి

ABN , First Publish Date - 2020-08-20T11:51:28+05:30 IST

కాశినాయన మండలం నరసాపురంలో బీసీ కులానికి చెందిన గుర్రప్ప అనే వ్యక్తి వైసీపీ నాయకులు, కార్యకర్తలు మూడురోజుల క్రితం ఇంటిలోకి వెళ్లి

వైసీపీ దౌర్జన్యానికి టీడీపీ కార్యకర్త బలి

బద్వేలు, ఆగస్టు 19 : కాశినాయన మండలం నరసాపురంలో బీసీ కులానికి చెందిన గుర్రప్ప అనే వ్యక్తి వైసీపీ నాయకులు, కార్యకర్తలు మూడురోజుల క్రితం ఇంటిలోకి వెళ్లి కర్రలతో దాడి చేయడంతో చికిత్స పొందుతూ బుఽధవారం మృతి చెందాడని బద్వేలు నియోజకవర్గ టీడీపీ నేత డాక్టర్‌ ఓబులాపురం రాజశేఖర్‌ అన్నారు. అతడి మృతికి కారకులైన వైసీపీ నాయకులను తక్ష ణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. బుధవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో వారి కుటుంబానికి టీడీపీ తరపున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామన్నారు. దాడి చేసిన వైసీపీ నాయకులపై ఫిర్యాదు చేసినా కలసపాడు పోలీసులు కేసు తీసుకోకపోవడం దారుణమైన విషయమన్నారు. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదన్నారు. గురప్ప విషయంలో న్యాయం జరిగే వరకూ టీడీపీ పోరాడుతుందని అన్నారు. 

Read more