పేదల కడుపు కొట్టడమే వైసీపీ నాయకుల పని

ABN , First Publish Date - 2020-12-16T04:56:25+05:30 IST

మండలంలోని నాగిరెడ్డిపల్లె మే జర్‌ గ్రామ పంచాయ తీ పరిధిలోని నారాయణరాజుపేట గ్రా మంలో గతంలో పేదలకు ఇచ్చిన స్థలాలను తగ్గించి వారి కడుపుకొట్టేందుకు వైసీపీ నాయకులు, అధికారు లు చర్యలు చేపట్టడం అన్యాయమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్‌రాయులు అన్నారు.

పేదల కడుపు కొట్టడమే వైసీపీ నాయకుల పని
బాధితులతో మాట్లాడుతున్న బత్యాల చెంగల్‌రాయులు

 బత్యాల చెంగల్‌రాయులు 

నందలూరు, డిసెంబరు15 : మండలంలోని నాగిరెడ్డిపల్లె మే జర్‌ గ్రామ పంచాయ తీ పరిధిలోని నారాయణరాజుపేట గ్రా మంలో గతంలో పేదలకు ఇచ్చిన స్థలాలను తగ్గించి  వారి కడుపుకొట్టేందుకు వైసీపీ నాయకులు, అధికారు లు చర్యలు చేపట్టడం అన్యాయమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్‌రాయులు అన్నారు. మంగళవారం నారాయణరాజుపేటలోని ఇళ్ల స్థలాలను ఆయన పరిశీలించి బాధితులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఇక్కడ 250మందికి పైగా రెండు సెంట్ల స్థలాన్ని పేదలకు జరిగిందన్నారు. ఇందులో 67మంది వివిధ దశలలో ఇళ్లను నిర్మించుకున్నారన్నారు. నేడు అధికారులు వచ్చి ఒకటిన్నర్ర సెంటులో మాత్రమే ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వడం జరుగుతోందని అర్ధ సెంటులో ఉన్న నిర్మాణాలను తొలగిస్తామని అధికారులు చెప్పడం బాధాకరమన్నారు.  ఇక్కడి ఇంటి నిర్మాణాలలోని ఒక రాయిని తొలగించిన ఊరుకోబోమని హెచ్చరించారు. టీడీపీ మండల అధ్యక్షుడు సమ్మెట శివప్రసాద్‌, మాజీ జడ్పీటీసీ శివరామరాజు, నాయకులు భారతాల శ్రీధర్‌బాబుయాదవ్‌, పసుపులేటి ప్రవీణ్‌, చామంచి పెంచలయ్య, పసుపులేటి శ్రీనివాసులు, తోట శివశంకర్‌, కొండిశెట్టి సుదర్శన్‌, చుక్కా యానాది, మందపల్లె శ్రీను తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-16T04:56:25+05:30 IST