‘మంజూరైన బ్రిడ్జీలను ఆపిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే...’

ABN , First Publish Date - 2020-12-07T04:36:45+05:30 IST

రాష్ట్రంలో గతంలో మంజూరైన బ్రిడ్జీలను ఆపిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని మాజీ ఎమ్మెల్సీ రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్‌రాయులు ఆరోపించారు.

‘మంజూరైన బ్రిడ్జీలను ఆపిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే...’
దెబ్బతిన్న వంతెన వద్ద బత్యాల

చిట్వేలి, డిసెంబరు6 : రాష్ట్రంలో గతంలో మంజూరైన బ్రిడ్జీలను ఆపిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని మాజీ ఎమ్మెల్సీ రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్‌రాయులు ఆరోపించారు. ఆదివారం మండల పరిధిలోని మైనపల్లె పంచాయతీ కొండ్లోపల్లె - రాచపల్లె కొట్టుకుపోయిన వంతెనను మండల టీడీపీ సీనియర్‌ నాయకులు బాలు రామాంజనేయులు, లారీ సుబ్బరాయుడుతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం హయాంలో బ్రిడ్జీకి 2,15కోట్ల రూపాయలు మంజూరైందన్నారు. అయితే జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఐదు నెలల్లో బ్రిడ్జీని ఆపిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన ఆరోపించారు.  ఈ కార్యక్రమంలో రాచపల్లె గ్రామప్రజలు, కొత్తపల్లె గ్రామ ప్రజలు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. 


Read more