చిరు వ్యాపారులకు అండగా వైసీపీ ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-11-26T05:10:14+05:30 IST

వైసీపీ ప్రభుత్వం చిరు వ్యాపారులకు అండగా నిలుస్తోందని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి అన్నారు.

చిరు వ్యాపారులకు అండగా వైసీపీ ప్రభుత్వం
బద్వేలులో లబ్ధిదారులకు చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్సీ

బద్వేలు, నవంబరు 25:వైసీపీ ప్రభుత్వం చిరు వ్యాపారులకు అండగా నిలుస్తోందని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో, స్థానిక ఎన్‌జీఓ భవనంలో జగనన్న తోడు పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న తోడు పథకం ద్వారా చిరు వ్యాపారులకు వడ్డీలేకుండా రూ.10వేలు అందుతుందని, ఈ రుణం సంవత్సర కాలంలో వడ్డీలేకుండా చెల్లించాలన్నారు. రుణం చెల్లిస్తే మరోసారి రూ.10వేలు తీసుకునే అవకాశం ఉందన్నారు. మున్సిపాలిటీ పరిధిలో జగనన్న తోడు, పీఎం స్వానిధి పథకం కింద 1571 మంది చిరు వ్యాపారులకు రూ.1,57,10,000 చెక్కును అందజేశారు. అలాగే మండల పరిధిలోని 383 మంది చిరు వ్యాపారులకు రూ.38,30,000 చెక్కులను పంపిణీ చేశారు. మున్సిపల్‌ కమిషనర్‌ కృష్ణారెడ్డి, ఎంపీడీఓ రామకృష్ణ, కరెంటు రమణారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, బోడపాడు రామసుబ్బారెడ్డి, మెప్మా అధికారులు పాల్గొన్నారు.

Read more