పనులు వేగవంతంగా చేయండి

ABN , First Publish Date - 2020-12-11T04:50:08+05:30 IST

ప్రస్తుతం నాడు- నేడు ద్వారా ఎంపికైన పాఠశాలల్లో జరుగుతున్న పనులను వేగవంతంగా చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తినరసింహారెడ్డి తెలిపారు.

పనులు వేగవంతంగా చేయండి

ఎమ్మెల్సీ కత్తినరసింహారెడ్డి

సుండుపల్లె, డిసెంబరు10: ప్రస్తుతం నాడు- నేడు ద్వారా ఎంపికైన పాఠశాలల్లో జరుగుతున్న పనులను వేగవంతంగా చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తినరసింహారెడ్డి తెలిపారు. గురువారం సుండుపల్లె, జీకేరాచపల్లె ఉన్నత పాఠశాలల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు.  మోడ ల్‌ స్కూల్‌కు వచ్చిన 30 లక్షల నిధులు వెనక్కి వెళ్లకుండా ప్రధానోపాధ్యాయులు, స్కూల్‌ కమిటీ చైర్మన్‌ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని తెలిపారు. ఆయన వెంట ఎస్టీయూ నాయకులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-11T04:50:08+05:30 IST