మహిళ నగల బ్యాగును కాజేసిన దొంగలు

ABN , First Publish Date - 2020-12-07T04:53:48+05:30 IST

పులివెందులలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయురాలు కడపలో ఓ ఫంక్షన్‌కు బస్సులో వస్తుండగా దొంగలు ఆమెను ఏమార్చి నగలున్న బ్యాగుతో ఉడాయించారు.

మహిళ నగల బ్యాగును కాజేసిన దొంగలు

కడప(క్రైం), డిసెంబరు 6: పులివెందులలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయురాలు కడపలో ఓ ఫంక్షన్‌కు బస్సులో వస్తుండగా దొంగలు ఆమెను ఏమార్చి నగలున్న బ్యాగుతో ఉడాయించారు. దీంతో ఆ ఉపాధ్యాయురాలు తాలుకా పోలీసులకు ఫిర్యా దు చేశారు. పోలీసుల కథనం మేరకు... తాలుకా సీఐ నాగభూషణం వివరాల మేరకు.. రవీంద్రనగర్‌కు చెందిన షేక్‌ మున్వర్‌జాన్‌, ఆమె భర్త ఆలీఅక్బర్‌లు పులివెందుల ప్రాంతలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు. ఆమె అన్న కుమార్తె ఫంక్షన్‌ ఉండటంతో శనివారం సాయంత్రం కడపకు వచ్చేందుకు నగల బ్యాగు తీసుకుని పులివెందుల ఆర్టీసీ బస్టాండుకు వచ్చి బస్సు ఎక్కారు. ఆ సమయంలో గుర్తు తెలియని ముగ్గురు మహిళలు మున్వర్‌ను అనుసరిస్తూ ఆమె కూర్చున్న సీటు పక్కనే కూర్చున్నారు. కడప ఐటీఐ సర్కిల్‌ వద్దకు రాగానే దిగే సమయంలో ఆమెను ఏమార్చి నగలున్న బ్యాగును కాజేసినట్లు ఆమె పోలీసులకు వివరించారు. సుమారు రూ.8.80 లక్షలు విలువ చేసే 295 గ్రాములు బంగారు నగలు చోరీకి గురైనట్లు పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ తెలిపారు.  

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఎవరైనా బంగారం, వెండి, నగదుతో ప్రయాణం చేయాల్సి వస్తే అప్రమత్తంగా ఉండాలని తాలుకా సీఐ నాగభూషణం సూచించారు. దొంగలు మనమధ్యనే తిరుగుతుంటారని, ఏమాత్రం ఏమారినా మన వద్ద ఉన్న నగలు కానీ, బంగారు కానీ మా యమ వడం ఖాయమని పేర్కొన్నారు. అప్రమత్తంగా లేకపోయినా తగిన జాగ్రత్తలు తీసుకోకపోయినా సొమ్ము చోరీకి గురికాక తప్పదన్నారు.

Read more