న్యాయవాద వృత్తికి వన్నె తెచ్చారు

ABN , First Publish Date - 2020-03-15T10:47:32+05:30 IST

దివంగత సీనియర్‌ న్యాయవాదులు ఈవీ నాగిరెడ్డి, జి.శ్రీరాములరెడ్డిలు న్యాయవాద వృత్తికి వన్నె తెచ్చారని సీనియర్‌

న్యాయవాద వృత్తికి వన్నె తెచ్చారు

నాగిరెడ్డి, శ్రీరాములరెడ్డి చిత్రపటాల అవిష్కరణలో హైకోర్టు జడ్జిలు 


ప్రొద్దుటూరు క్రైం, మార్చి 14 : దివంగత సీనియర్‌ న్యాయవాదులు ఈవీ నాగిరెడ్డి, జి.శ్రీరాములరెడ్డిలు న్యాయవాద వృత్తికి వన్నె తెచ్చారని సీనియర్‌ హైకోర్టు జడ్జి సి.ప్రవీణ్‌కుమార్‌, జిల్లా అడ్మినిస్ట్రేటివ్‌ హైకోర్టు జడ్జి ఎం.వెంకటరమణ కొనియాడారు. శనివారం ప్రొద్దుటూరు కోర్టు భవనంలో ఏర్పాటు చేసిన ఈవీ నాగిరెడ్డి, జి.శ్రీరాములరెడ్డిల చిత్రపటాలను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హైకోర్టు జడ్జిలు మాట్లాడుతూ ఈవీ నాగిరెడ్డి, జి.శ్రీరాములరెడ్డిలు న్యాయవాదులుగా అందించిన సేవలు మరువలేనివన్నారు. ఈ తరం న్యాయవాదులకు ఈ ఇద్దరు ఆదర్శనీయమన్నారు.


వారి అడుగుజాడల్లో న్యాయవాదులు నడవాలని అభిలషిస్తున్నామన్నారు. ప్రొద్దుటూరు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మార్తల సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఈవీ న్యాయవాదుల చిత్రపటాలను బార్‌ అసోసియేషన్‌ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఈవీ నాగిరెడ్డి కుమారుడు సీనియర్‌ న్యాయవాది ఈవీ సుధాకర్‌రెడ్డి, పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు. కాగా హైకోర్టు జడ్జిల రాక సందర్భంగా డీఎస్పీ సుధాకర్‌ లోసారి నేతృత్వంలో సీఐలు సుబ్బారావు, నరసింహారెడ్డి, నాగరాజు, ఎస్‌ఐలు, సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. 

Updated Date - 2020-03-15T10:47:32+05:30 IST