ఆదిమానవుడి రేఖాచిత్రాల పర్యాటక కేంద్రం ఎప్పుడో..?

ABN , First Publish Date - 2020-12-29T05:07:42+05:30 IST

మండలంలోని చింతకుంట కొండపై వెలుగులోకి వచ్చిన ఆదిమానవుడి రేఖాచిత్రాలను పర్యాటక కేంద్రంగా ఎప్పుడు ప్రకటిస్తారని పురావస్తు ప్రేమికులు కోరతున్నారు.

ఆదిమానవుడి రేఖాచిత్రాల పర్యాటక కేంద్రం ఎప్పుడో..?
చింతకుంట కొండలో ఆదిమానవుడు చిత్రీకరించిన రేఖాచిత్రం

ముద్దనూరు డిసెంబరు28: మండలంలోని చింతకుంట కొండపై వెలుగులోకి వచ్చిన ఆదిమానవుడి రేఖాచిత్రాలను పర్యాటక కేంద్రంగా ఎప్పుడు ప్రకటిస్తారని  పురావస్తు ప్రేమికులు కోరతున్నారు. కొండలో  ఎద్దుల ఆవుల గుండు, గొడుగుగుండు, చిన్నావిడగుండు, పెద్దావిడగుం డు, మారెమ్మగుండు, గనంగుండు, చిలకలోల్లగుండ్లపై ఆదిమానవుడు నాటి నాగరికత, జంతువుల రేఖాచిత్రాలను కొండ రాళ్ల గుండ్లకు ఆకుపసరుతో నేటి యుగం యువత కు కనువిందు చేసేవిధంగా చిత్రించాడు. ఏనుగు, జింక, దుప్పి, నక్క, కుందేలు, పక్షులు, ఎద్దు, విల్లంభులు ఎక్కు పెట్టిన మానవాకృతులు, అప్పటి వేటకు ఉపయోగించే పని ముట్లు, లైంగిక చిత్రాలు దాదాపు 200 రేఖాచిత్రాలు  కనిపిస్తాయి. ఈరేఖాచిత్రాలను తిలకించిన ఎంతో మంది మేధావులు నీరు,వాతావరణం, ఆహారం ఈప్రదేశంలో పుష్కలంగా ఉంటాయని అందుకే ఆదిమానవుడు అతనికి అనువైన ప్రదేశంగా ఎంచుకుని నివాస ప్రదేశంగా ఏర్పరుచుకుని ఉంటారని అంటున్నారు. ఈ రేఖాచిత్రాలు, కొండప్రాంతాన్ని పురావస్తుశాఖ అధికారులు పరిశీలించారు. రేఖాచిత్రాల ప్రాంతాన్ని పర్యాటక కేంద్రం మార్చాలని ప్రజలు కోరుతున్నారు. అక్టోబరులో తిరుపతి పురావస్తుశా ఖాధికారులు వాటిని పరిశీలించారు.  

Updated Date - 2020-12-29T05:07:42+05:30 IST