వైభవంగా కోదండరాముని కల్యాణం

ABN , First Publish Date - 2020-12-31T05:04:34+05:30 IST

ఏకశిలా నగి రి కోదండరామాలయంలో సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించారు

వైభవంగా కోదండరాముని కల్యాణం
ఆశీనులైన సీతారాములు

ఒంటిమిట్ట, డిసెంబరు30 : ఏకశిలా నగి రి కోదండరామాలయంలో సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించారు. పౌ ర్ణమి సందర్భంగా ప్ర తి నెలా రామాలయం లో సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ముందుగా ఉత్సవ మూర్తులైన సీతారాములను ప్రత్యేకంగా అలంకరించి రంగ మండపంలో కల్యాణ తంతును ప్రారంభించారు.  కంకణధారణ, కన్యాదానం తదితర పూజల అనంతరం హోమాన్ని నిర్వహించి మాంగళ్యధారణ నిర్వహించారు. అనంతరం తలంబ్రాల సమర్పణ నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు.  టీటీడీ ఇన్‌స్పెక్టర్‌ ధనుంజయనాయుడు, టీటీడీ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-31T05:04:34+05:30 IST