చేనేత కార్మికులను అన్ని విధాల ఆదుకోవాలి

ABN , First Publish Date - 2020-12-02T04:45:34+05:30 IST

తుఫాన్‌ వల్ల మగ్గం గుం తల్లో నీరుచేరి పనుల్లేక ఉపాధికోల్పోయిన చేనేత కార్మికులను అన్ని విధాల ఆదుకోవాలని బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ గొర్రె శ్రీనివాసులు ప్రభుత్వాన్ని కోరారు.

చేనేత కార్మికులను అన్ని విధాల ఆదుకోవాలి
చేనేత కార్మికుల సమస్యలపై మాటాడుతున్న గొర్రె శ్రీనివాసులు

ప్రొద్దుటూరు అర్బన్‌, డిసెంబర్‌ 1 : తుఫాన్‌  వల్ల మగ్గం గుం తల్లో నీరుచేరి పనుల్లేక ఉపాధికోల్పోయిన చేనేత కార్మికులను అన్ని విధాల ఆదుకోవాలని బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ గొర్రె శ్రీనివాసులు ప్రభుత్వాన్ని కోరారు.మంగళవారం బీజేపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో దొరసానిపల్లె గ్రామంలో తుపాను వల్ల మగ్గం గుంతల్లోనీరు చేరి సామగ్రి దెబ్బతిన్న చేనేత కార్మికుల కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రొద్దుటూరులో 11వేల చేనేత కుటుం బాలున్నాయని వారంతా కరోనా లాక్‌డౌన్‌ సమయంలోను ప్రస్తుతం తుఫాను  వల్ల పలులు లేక తీవ్రంగా నష్టపోయారని అలాంటి వారిని ఆదుకోవడంతో స్థానిక ఎమ్మెల్యేతోపాటు అధి కారులు పట్టించుకోలేదని విమర్శించారు.  కాగా ఇటీవల వర్షాల వల్ల నష్ట పోయిన రైతులకు కోటి రూపాయలు విరాళంగా ఎమ్మెల్యే ప్రకటించారని కాని వర్షాలతో నష్టపోయిన చేనేతలను పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ప్రొద్దుటూరులో చేనేతలకు ఏవిధంగా సాయం చేస్తామన్న విషయంపై కేంద్ర  ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని పట్టణ అధ్యక్షుడు సుబ్రమణ్యం తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ కార్యదర్శి ఆంజనేయులు రఘురామిరెడ్డి, బాస్కర్‌రెడ్డి,సుధాకర్‌రెడ్డి, మహేష్‌, నరేంద్ర, కృష్ణలు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-02T04:45:34+05:30 IST