రాష్ట్రంలోనే మోడల్ బస్టాండ్‌గా తీర్చిదిద్దుతాం
ABN , First Publish Date - 2020-10-08T08:30:15+05:30 IST
రాష్ట్రంలోనే మోడల్ బస్టాండ్‌గా పులివెందుల బస్టాండ్‌గా తీర్చిదిద్దుతామని ఏపీఎ్‌సఆర్టీసీ సీఈ శ్రీనివాస్ తెలిపారు.

9 కోట్ల నిధులు మంజూరు
ఏపీఎ్‌సఆర్టీసీ సీఈ శ్రీనివాస్
పులివెందుల టౌన్, అక్టోబరు 7: రాష్ట్రంలోనే మోడల్ బస్టాండ్‌గా పులివెందుల బస్టాండ్‌గా తీర్చిదిద్దుతామని ఏపీఎ్‌సఆర్టీసీ సీఈ శ్రీనివాస్ తెలిపారు. పులివెందులలో బస్టాండ్ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని అధికారులతో కలిసి బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మ్యాప్‌ను పరిశీలించి అధికారులతో పలు అంశాలపై చర్చించారు. అనంతరం సీఈ మాట్లాడుతూ ఇక్కడ 50 వేల చదరపు అడుగులలో 18 ఫ్లాట్‌ఫాంలతో బస్టాండ్ నిర్మిస్తామన్నారు. గ్రౌండ్‌ఫ్లోర్, ఫస్ట్‌ఫ్లోర్‌లు ఉంటాయన్నారు. మొత్తం 9 కోట్ల నిధులు బస్టాండ్ నిర్మాణానికి మంజూరయ్యాయ్నారు.
ఈ నిధులతో కాంపౌండ్‌వాల్ నిర్మాణం, స్థలంలో పలు సౌకర్యాల కల్పన తదితర పనులు మొదట పూర్తి చేసిన అనంతరం ఫ్లాట్‌ఫాంల నిర్మాణం చేపడతామన్నారు. ఇక్కడ నిర్మించే బస్టాండ్‌లో ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు ఉంటాయని, మోడల్ బస్టాండ్‌గా రూపుదిద్దుకుంటుందన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఎం జితేంద్రనాథరెడ్డి, ఈఈ వెంకటరమణ, డీఈ పోతురాజు, సీఎంఎఫ్ భాస్కర్, గ్యారేజీ మేనేజర్ భాస్కర్, డీఎం రఘురాం, సిబ్బంది పాల్గొన్నారు.