పుస్తక పఠనంతో విజ్ఞానం

ABN , First Publish Date - 2020-12-07T04:22:56+05:30 IST

పుస్తక పఠనంతో విద్యార్థుల్లో విజ్ఞానం పెరుగుతుంద ని సర్వశిక్ష అభియాన పీఓ ప్రభాకర్‌రెడ్డి పే ర్కొన్నారు.

పుస్తక పఠనంతో విజ్ఞానం
పుస్తక పఠనం పరిశీలిస్తున్న పీఓ ప్రభాకర్‌రెడ్డి

బద్వేలు రూరల్‌, డిసెంబరు 6: మంచి పుస్తక పఠనంతో విద్యార్థుల్లో విజ్ఞానం పెరుగుతుంద ని సర్వశిక్ష అభియాన పీఓ ప్రభాకర్‌రెడ్డి పే ర్కొన్నారు. ‘వుయ్‌ లవ్‌ రీడింగ్‌’లో భాగంగా ఆదివారం జిల్లా పరిషత బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు గ్రంధాలయంలో పుస్తక పఠనం చేస్తున్న విధానాన్ని పరిశీలించిన ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పాఠ్య పుస్తకాలే కాకుండా విజ్ఞానాన్ని పెం పొందించే మంచి పుస్తకాలు చదవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్వహిస్తోందన్నా రు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయకుమార్‌రెడ్డి, డీపీ నరసింహులు, శ్రీనివాసులు, రమణమూర్తి, చక్రపాణి, ఆచారి, లైబ్రేరియన పాల్గొన్నారు. 


పులివెందుల టౌన, డిసెంబరు 6: గ్రంథాలయంలో చదవడం మాకిష్టం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి కృష్ణకిషోర్‌రెడ్డి మాట్లాడారు. పలు పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నా రు. ఉపాధ్యాయులు ప్రసాద్‌రెడ్డి, సిద్దయ్య, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.


చాపాడు, డిసెంబరు 6: మండలంలోని అన్ని గ్రామాల విద్యార్థులు గ్రంఽథాల యాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యాశాఖాధికారి రవి శంకర్‌  పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన చదవడం మాకిష్టం అనే కార్యక్రమాన్ని చాపాడు గ్రంఽథాలయంలో నిర్వహించారు.  కార్యక్రమంలో కస్తూర్భాగాంధీ బాలికల పాఠశా ల అధికారి మల్లేశ్వరి, సీఆర్పీ సిద్దమ్మ, లైబ్రేరియన్‌ శివశంకర్‌రెడ్డి పాల్గొన్నారు.

Read more