టోర్నమెంటును విజయవంతంగా ముగించాం

ABN , First Publish Date - 2020-03-13T10:43:57+05:30 IST

మొదటిసారిగా బీసీసీఐ అండ ర్‌ 19 అంతర్‌ రాష్ట్ర వన్డే మహిళా ప్లేట్‌ గ్రూప్‌ టోర్నమెంటును కడప నగర శివార్లలోని వైఎస్‌

టోర్నమెంటును విజయవంతంగా ముగించాం

మొదటిసారి కడపలో బీసీసీఐ టోర్నమెంటు 

ఆకట్టుకున్న కశ్వీగౌతం, పరుశీ ప్రభాకర్‌, మేఘశర్మ 

ప్రపంచ రికార్డు సాధించిన కశ్వీగౌతంకు అభినందనలు


కడప (స్పోర్ట్స్‌), మార్చి 12 : మొదటిసారిగా బీసీసీఐ అండ ర్‌ 19 అంతర్‌ రాష్ట్ర వన్డే  మహిళా ప్లేట్‌ గ్రూప్‌ టోర్నమెంటును కడప నగర శివార్లలోని వైఎస్‌ రాజారెడ్డి, ఆంధ్ర క్రికె ట్‌ అసోసియేషన్‌ క్రికెట్‌ మైదానంలో జిల్లా క్రికెట్‌ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా ముగించామని ఆంధ్ర కిక్రె ట్‌ అసోసియేసన్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ మాజీ ఎమ్మెల్సీ మండ ్ల వెంకటశివారెడ్డి పేర్కొన్నారు. 23 రోజుల పాటు పది రాష్ట్రాల మహిళా క్రికెటర్లు చక్కటి ప్రతిభ కనబరిచారన్నా రు. అనంతరం ప్రతిభ కనబరిచిన క్రీడాకారిణినులను అబినంధించారు. మ్యాచ్‌ అఫిషియల్స్‌కు మెమెంటో అందించా రు. ఈ కార్యక్రమంలో  కడప జిల్లా క్రికెట్‌ సంఘం అధ్యక్ష కార్యదర్శులు మురికినాటి భరత్‌రెడ్డి, పట్టంరెడ్డి సంజయ్‌కుమార్‌రెడ్డి,  ఏసీఏ స్కూలు అకాడమీ కన్వీనర్‌ నాగేశ్వర్‌రాజు, పరిపలనాధికారి శ్రీనివాసులు, కేడీసీఏ కోశాఽధికారి నజీర్‌అహ్మద్‌ ఉపాధ్యక్షుడు గంధంనగే్‌షకుమార్‌రాజు, అపెక్స్‌ కౌన్సిలర్‌ నిరంజన్‌కుమార్‌, ఈశ్వర్‌, మ్యాచ్‌ రెఫరీ, నియాతి, ఎసీఎల్‌వో వీఎస్‌ పటేల్‌, మాజీ రంజి క్రి కెటర్‌ పైడికాల్వ విజయకుమార్‌, బీసీసీఐ వీడియో అనాలసిస్ట్‌ రెహమాన్‌, కోచ్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.


ఔరా కశ్వీ గౌతం

చండీఘర్‌ ఆల్‌ రౌండర్‌ కెప్టెన్‌ కశ్వీగౌతం ఈ టోర్నమెంటు లో ప్రపంచ రికార్డు సాధించి ఔరా అనిపించింది. ఒక మ్యా చ్‌లో 10 వికెట్లు తీయడంతో పాటు 9 మ్యాచ్‌లలో జట్టును విజయవంతంగా 7 మ్యాచ్‌లను గెలిపించడంలో తనదైన ముద్ర వేసుకుంది. 9 మ్యాచ్‌లలో 35 వికెట్లు తీసి 281 పరుగులు చేసింది. ఇందులో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఈమె సాధించిన ప్రపంచ రికార్డుల వల్ల కడప జిల్లా పేరు చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. ఈమెను కేడీసీఏ తరుపున 10వేల నగదు బహుమతిని అధ్యక్షుడు భరత్‌రెడ్డి చేతుల మీ దుగా అందించారు. మెమెంటోను ఏసీఏ సీఈవో ఎంవీ శివారెడ్డి అందించారు. ఇందులో చండీఘర్‌ బ్యాట్స్‌మెన్‌ పరుశీ ప్రభాకర్‌ రెండు సెంచరీలు ఒక అర్ధసెంచరీ సాధించింది. టోర్నమెంటులో 367 అత్యధిక పరుగులు సాదించిన క్రీడాకారిణిగా నిలిచింది. అలాగే అరుణచల్‌ ప్రదేశ్‌కు చెందిన మేఘశర్మ  148 వ్యక్తిగత స్కోరు వద్ద నా టౌట్‌గా నిలిచింది. 


క్వార్టర్‌ఫైనల్‌ చేరిన పాండిచ్చేరి జట్టు

టోర్నమెంటులో 9 మ్యాచ్‌లకు గాను 9 మ్యాచ్‌లు గెలిచి పాండిచ్చేరి జట్టు పాయంట్ల పట్టికలో ప్రఽథమ స్థానంలో ని లిచింది. దీంతో పాండిచ్చేరి జట్టు క్వార్టర్‌ ఫైనల్‌ చేరింది. తరువాత 9 మ్యాచ్‌లకు గాను బీహార్‌ జట్టు 8 మ్యాచ్‌లు గె లిచి పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో నిలిచింది. ఈ నెల 16 నుంచి పాండిచ్చేరిలో జరిగే క్వార్టర్‌ ఫైనల్‌, సెమీ ఫైనల్‌, ఫైనల్‌ మ్యాచ్‌లకు అర్హత సాధించింది. 


మ్యాచ్‌ల వివరాలు

వైఎ్‌సఆర్‌ఆర్‌, ఏసీఏ మైదానంలో నాగాలండ్‌ చండీఘర్‌ జ ట్ల ఽమధ్య మార్చిలో నాగాలండ్‌ జట్టు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. 48.5 ఓవర్లలో 115 పరుగులకు ఆలౌట్‌ అయిం ది. తరువాత బ్యాటింగ్‌ చేసిన చండీఘర్‌ జట్టు 47.4 ఓవర్లలో 8 వికెట్ల నస్టానికి 118 పరుగులు చేసింది. కేఎ్‌సఆర్‌ఎంలోపాండిచ్చేరి, జమ్ముకశ్మీర్‌ జట్ల మ్యాచ్‌లో పాండిచ్చేరి టాస్‌గెలిచి ఫీల్డింగ ఎంచుకుంది. జమ్ముకశ్మీర్‌ జట్టు 40.2 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌట్‌ అయింది. పాండిచ్చేరి జట్టు తరువాత బ్యాటింగ్‌ చేసి 15.5 ఓవర్లలో 2 వికెట్ల నస్టానికి 104 పరుగులు చేసింది. కేవోఆర్‌ఎంలో అరుణచల్‌ప్రదేశ్‌-సిక్కిం జట్ల మఽధ్య మ్యాచ్‌ సిక్కిం జట్టు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో ఆరువికెట్లనష్టానికి 115 పరుగులు చేసింది. తరువాత బ్యా టింగ్‌ చేసిన అరుణచల్‌ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నస్టానికి 75 పరుగలు చేసింది. 

Updated Date - 2020-03-13T10:43:57+05:30 IST