వేగవంతంగా తాగునీటి పనులు
ABN , First Publish Date - 2020-12-21T05:02:26+05:30 IST
పట్టణానికి తాగునీటిని అందించేందుకు చేపడుతున్న మెగా పైప్‌లైన్ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.

ప్రొద్దుటూర అర్బన్, డిసెంబరు 20 : పట్టణానికి తాగునీటిని అందించేందుకు చేపడుతున్న మెగా పైప్‌లైన్ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. రూ.151.38 కోట్లతో చేపట్టే ఈపనుల్లో 16 కిలోమీటర్ల మేర నిర్మించే డిస్ర్టిబ్యూషన్ మెయిన్ లైన్ పనులను ఆదివారం మెగా ఇంజనీరింగ్ సిబ్బంది ప్రారంభించారు. రామేశ్వరం హెడ్ వాటర్ వర్క్స్ నుంచి జమ్మ లమడుగు బైపాస్ రోడ్డు మీదుగా పట్టణంలోని బొల్లవరం, వైఎంఆర్ కాలనీ, సంజీవనగర్ తాగునీటి రిజర్వాయర్లకు నీటిని సరఫరా చేసేందుకు 600 ఎంఎం డయామీటర ్ల పైపులను అమర్చుతున్నారు. 1.2 మీటర్ల లోతులో పైప్‌లైన్ పై ఎలాంటి ప్రెజర్ కలగకుండా అమర్చుతున్నట్లు పబ్లిక్‌హెల్త్ డీఈ గరిరాజ్ తెలిపారు. మరో లైన్‌హెడ్‌వాటర్ వర్క్స్ నుంచి రామేశ్వరం గుండా రామేశ్వరం రిజర్వాయర్,ఆర్ట్స్‌కాలేజి రిజర్వాయర్లకు, ఎర్రగుంట్ల బైపాస్‌రోడ్డు నుంచి మోడంపలి,్ల పాతమార్కెట్ రిజ ర్వాయర్లకు మరో పంపింగ్‌లైన్ పనులు మెదలు పెట్టారు. మైలవరం నుంచి గ్రావిటీ ద్వారా వ చ్చేనీటి ప్రధాన పైప్‌లైన్ జమ్మలమడుగు రోడ్డుమార్గాన రామేశ్వ రం హెడ్‌వాటర్‌వర్క్సు వరకు 900 ఎంఎం డయా డిఐ పైపులను అమర్చే పనులు సైతం చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే రిజర్వాయర్ నిర్మాణం 50 శాతం పూర్తి అయిందని, ఇసుక కొరత కారణంగా కొంత పనుల జాప్యం జరుగుతుందన్నారు. మరో వైపు రామేశ్వరం హెడ్ వాటర్ వర్క్స్ లో గ్రౌండ్‌లెవెల్ బ్యాలెన్పింగ్ రిర్వాయర్ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నట్లు డీఈ తెలిపారు.