తాగునీటి సమస్యను పరిష్కరించాలి

ABN , First Publish Date - 2020-12-12T05:13:39+05:30 IST

తాగునీటి సమస్యను పరిష్కరించాలని నాగిరెడ్డిపల్లె దళితవాడ, పరిసర ప్రాంతాల ప్రజలు శుక్రవారం పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించారు.

తాగునీటి సమస్యను పరిష్కరించాలి

నందలూరు, డిసెంబరు 11: తాగునీటి సమస్యను పరిష్కరించాలని నాగిరెడ్డిపల్లె దళితవాడ, పరిసర ప్రాంతాల ప్రజలు శుక్రవారం పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించారు. మాజీ సర్పంచ్‌ వేల్పుల లక్ష్మీదేవి ఆధ్వర్యంలో ఈ కార్య క్రమం జరిగింది. పంచాయతీ సెక్రటరీ ప్రసాద్‌ లేకపోవడంతో ఆర్‌ఎ్‌స రోడ్డుపై మూడు గంటల పాటు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్‌ లక్ష్మీదేవి మాట్లాడుతూ పది రోజులుగా తాగునీరు రావడం లేదన్నారు. పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదన్నారు. దప్పిక తీరక, పట్టించు కునే వారు లేక పంచాయతీ ముట్టడి నిర్వహించామన్నారు. అనంతరం కడప-చెన్నై జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించేందుకు ఎస్‌ఐ లక్ష్మీప్రసాద్‌రెడ్డిని అనుమతి కోరగా పంచాయతీ ఈఓతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తాన్నారు. సమస్యను తెలుసుకున్న ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ వీరన్న ప్రజల వద్దకు చేరు కుని సమస్యను ఈ దినమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి ప్రసాద్‌ మాట్లాడుతూ తాగునీటి పైపులైనుకు మరమ్మతులు చేయి స్తున్నామన్నారు. దీంతో వారు ధర్నాను విరమిం చారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ సునీత, ఏఎ్‌సఐ సుబ్బరాయుడు, నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-12T05:13:39+05:30 IST