-
-
Home » Andhra Pradesh » Kadapa » Voter entry for Youth
-
యువత ఓటుహక్కు నమోదు చేసుకోవాలి: కలెక్టర్
ABN , First Publish Date - 2020-11-28T05:22:24+05:30 IST
ప్రత్యేక ఓటరు జాబితా సంక్షిప్త సవరణ 2021లో భాగంగా 1వ తేది జనవరి 2021 నాటికి 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సి.హరికిరణ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

కడప(కలెక్టరేట్), నవంబరు 27: ప్రత్యేక ఓటరు జాబితా సంక్షిప్త సవరణ 2021లో భాగంగా 1వ తేది జనవరి 2021 నాటికి 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సి.హరికిరణ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంతవరకు ఓటు నమోదు చేసుకోని వారికి ఓటుహక్కు పొందేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఈ నెల 28వ తేది, 29, డిసెంబరు 12, 13 తేదీలలో బూతులెవల్ అధికారుల ద్వారా ప్రత్యేక ఓటరు నమోదు చేసుకోవచ్చన్నారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.