ఉరి వేసుకుని మాజీ వలంటీరు ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-12-12T05:13:48+05:30 IST

మండలంలోని రామనపల్లెకు చెందిన ఎస్‌.రాజా (24) అనే యువకుడు శుక్రవారం తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఉరి వేసుకుని మాజీ వలంటీరు ఆత్మహత్య
ఆత్మహత్య చేసుకున్న రాజా

చెన్నూరు, డిసెంబరు 11: మండలంలోని రామనపల్లెకు చెందిన ఎస్‌.రాజా (24) అనే యువకుడు శుక్రవారం తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... వలంటీరుగా పనిచేసే రాజా 40 రోజుల క్రితం రాజీనామా చేశారు. అంతకు ముందే ఇంట్లో ఆడబిడ్డ వివాహం కోసం అప్పులు చేశారు. ఆ అప్పులు వడ్డీతో సహా పెరగడంతో వాటిని తీర్చే మార్గం లేకుండా పోయింది. పైగా వలంటీరుగా నెలనెలా వచ్చే రూ.5వేలు ఎందుకూ సరిపోదని.. దీంతో మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరి వేసుకుని మృతి చెందాడు. ఎస్‌ఐ తులసినాగ ప్రసాద్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-12-12T05:13:48+05:30 IST