-
-
Home » Andhra Pradesh » Kadapa » Visit New Bus Stand Works
-
పనులు త్వరితగతిన పూర్తిచేయాలి
ABN , First Publish Date - 2020-12-16T04:41:27+05:30 IST
నూతన ఆర్టీసీ బస్టాండ్ పనులు త్వరితగతిన పూర్తిచే యాలని ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆదాం సాహెబ్, ఆర్‌ఎం జితేంద్రనాథరెడ్డి అన్నారు.

పులివెందుల టౌన, డిసెంబరు 15: నూతన ఆర్టీసీ బస్టాండ్ పనులు త్వరితగతిన పూర్తిచే యాలని ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆదాం సాహెబ్, ఆర్‌ఎం జితేంద్రనాథరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి పులి వెందులకు రానున్న సందర్భంగా వారు ముద్ద నూరు రోడ్డులో 13 ఎకరాల్లో కొత్తగా నిర్మించే బస్టాండ్‌ను పరిశీలించిన అనంతరం వారు మా ట్లాడుతూ 24న సీఎం వైఎస్ జగనమోహనరెడ్డి ఆర్టీసీ బస్టాండ్, గ్యారేజీ నిర్మాణాలకు సంబంధిం చి భూమిపూజ చేయనున్నారన్నారు. ముఖ్యమం త్రి వచ్చే నాటికి ఆర్టీసీ బస్టాండ్‌లో చేపట్టే గ్రావె ల్ రోడ్డు, ప్రహరీ త్వరగా పూర్తిచేయాలని సంబంధిత కాంట్రాక్టర్లకు సూచించామన్నారు.
సుమారు రూ. 50కోట్లతో నిర్మించే ఆర్టీసీ బస్టాం డ్‌ను మోడల్ బస్టాండ్‌ను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంద న్నారు. ఆర్టీసీ బస్టాండ్‌కు సంబంధించి న మ్యాప్‌ను పరిశీలించారు. సీఎం పర్య టన వచ్చే నాటికి వీఐపీలు, వైసీపీ నేత లు, కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లను త్వరగా పూర్తిచేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ మాధవకృష్ణారెడ్డి, డీఎం రఘురాం, పీబీసీ ఈఈ రాజశేఖర్, ప్రభాకర్‌రెడ్డి, ఇంజనీర్లు పాల్గొన్నారు.