ఇళ్లల్లోనే వినాయక చవితి జరుపుకోవాలి

ABN , First Publish Date - 2020-08-20T11:53:30+05:30 IST

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లల్లోనే వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవాలని రాజంపేట సబ్‌కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌

ఇళ్లల్లోనే వినాయక చవితి జరుపుకోవాలి

రాజంపేట, ఆగస్టు19 : కరోనా వైరస్‌ విజృంభిస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లల్లోనే వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవాలని రాజంపేట సబ్‌కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌ వివరించారు. బుధవారం స్థానిక సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా డీఎస్పీ నారాయణస్వామిరెడ్డితో, పట్టణ ప్రముఖులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్‌కలెక్టర్‌ మాట్లాడుతూ చిన్నచిన్న ప్రతిమలను ఇళ్లల్లోనే పెట్టుకొని పూజలు చేసుకోవాలన్నారు. పెద్ద విగ్రహాలను ఏర్పాటు చేయడం, ఊరేగింపులు చేయడం, డ్రమ్ములు వాయించడం పూర్తిగానిషేధించామన్నారు.


డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి మాట్లాడుతూ చిన్న మట్టి వినాయక బొమ్మలు, పూజాసామగ్రి పాతబస్టాండు ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవాలని, అక్కడ ప్రజలు గుమిగూడే అవకాశం ఉన్నందున అక్కడున్న దుకాణాలను ఇతర ప్రాంతాలకుమార్చే ఏర్పా ట్లు చేయాలని కోరారు. మున్సిపల్‌ కమిషనర్‌ రాజశేఖర్‌, తహసీల్దారు రవిశంకర్‌, ఎంపీడీవో రెడ్డయ్య, సీఐలు శుభకుమార్‌, నరేందర్‌రెడ్డి, నీటిపారుదల శాఖ డీఈ రంగయ్య, దేవదాయ శాఖ ఈవో శ్రీధర్‌, ఫైర్‌ అధికారి శివశంకర్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారి రత్నకుమారి, విశ్వహిందూ పరిషత్‌ అధ్యక్షుడు శ్రీనివాసులు, రాముడు, రమణారెడ్డి, మనుబోలు వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. 

Read more