-
-
Home » Andhra Pradesh » Kadapa » vc
-
శ్రీకృష్ణ దేవరాయ వీసీగా రామకృష్ణారెడ్డి నియామకం
ABN , First Publish Date - 2020-11-26T05:13:56+05:30 IST
అనంతపురంలోని శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ వైస్ చాన్సిలర్‌గా వేంపల్లె మండలం గిడ్డంగివారిపల్లెకు చెందిన మాచిరెడ్డి రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు.

వేంపల్లె, నవంబరు 25: అనంతపురంలోని శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ వైస్ చాన్సిలర్‌గా వేంపల్లె మండలం గిడ్డంగివారిపల్లెకు చెందిన మాచిరెడ్డి రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. యోగివేమన యూనివర్సిటీలో జియాలజీ డిపార్ట్ మెంట్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తూ పదవీ విరమణ పొం దిన ఆయన్ను తాజాగా శ్రీకృష్ణ దేవరాయ యూని వర్సిటీకి వీసీగా ప్రభుత్వం నియమించింది. వైవీయూ లో ఆయనకు వివిధ పరిపాలన విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. కాగా రామకష్ణారెడ్డి వేంపల్లె మాజీ ఎంపీపీ మాచిరెడ్డి రవికుమార్‌రెడ్డి సోదరుడు.