నేరాలు అదుపుచేయని చట్టాలెందుకు?

ABN , First Publish Date - 2020-12-26T05:06:55+05:30 IST

రాష్ట్రంలో దళిత మహిళలపై పెరిగిపోతున్న నేరాలను అదుపు చేయని చట్టాలు ఎందుకని ఏపీ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్యమాదిగ ధ్వజమెత్తారు.

నేరాలు అదుపుచేయని చట్టాలెందుకు?
సమావేశంలో మాట్లాడుతున్న దండు వీరయ్య మాదిగ

ఏపీ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ 

ముద్దనూరు డిసెంబరు 25: రాష్ట్రంలో దళిత మహిళలపై పెరిగిపోతున్న నేరాలను అదుపు చేయని చట్టాలు ఎందుకని ఏపీ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్యమాదిగ ధ్వజమెత్తారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిఽథిగృహం ఆవరణలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దళిత మహిళలపై హత్యాచారాలు పెరిగిపోతున్నాయన్నారు. కూలికి వెళ్లిన మహిళలు, కళాశాలకు వెళ్లిన విద్యార్థినులు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగినులు తిరిగి వచ్చే వరకు తల్లిదండ్రులు భయాందోళనలో ఉన్నారన్నారు. ఇటీవల లింగాల మండలంలోని పెద్దకుడాల గ్రామంలో మేకల కాపరి దళిత మహిళ నాగమ్మ హత్య జరిగిందని, దీన్ని మరువక ముందే అనంతపురం జిల్లా ధర్మవరంలో ఈనెల 22న స్నేహలత దారుణ హత్యకు గురైందన్నారు. దిశ లాంటి కొత్త చట్టాలు ఎన్ని వచ్చినా ప్రయోజనం ఉం డదన్నారు. నేరస్తులకు న్యాయస్థానంలో కఠిన శిక్ష పడనంత వరకు మహిళలపై నేరాలు జరుగుతూనే ఉంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నియోజవకర్గంలో మహిళా పోలీస్‌ స్టేషన్‌లు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ధర్మవరంలో జరిగిన స్నేహలత దారుణ హత్యపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. దళిత మహిళలపై జరుగుతున్న హత్యలను ప్రభుత్వం ఆపాలని ఏపీ ఎమ్మార్పీయస్‌ ఆధ్వర్యంలో జనవరి 5వ తేదీన నియోజక కేంద్రాలలో ఆందోళన కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యల్లయ్య మాదిగ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీసీ గంగులు, మండల యువజన నాయకులు పవన్‌కుమార్‌, డప్పు, చర్మకారుల రాష్ట్ర కన్వీనర్‌ నాగభూషణం, జిల్లా కార్యదర్శి పుల్లయ్య మాదిగ, పాములేటి, ఓబయ్య, ఓబులేసు, మునెయ్య పాల్గొన్నారు.

Updated Date - 2020-12-26T05:06:55+05:30 IST