లలితకళల యూనివర్సిటీ ఏర్పాటుకు భూములను పరిశీలించిన కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-11-08T05:27:13+05:30 IST

లలిత కళల యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించి భూములను శనివారం కలెక్టర్‌ హరికిరణ్‌, జాయింట్‌ కలెక్టర్‌, సబ్‌కలెక్టర్‌లు పరిశీలించారు.

లలితకళల యూనివర్సిటీ ఏర్పాటుకు   భూములను పరిశీలించిన కలెక్టర్‌
యూనివర్సిటీ ఏర్పాటుకు మ్యాపును పరిశీలిస్తున్న కలెక్టర్‌, జేసీ, సబ్‌ కలెక్టర్‌

సిద్దవటం, నవంబరు7: సిద్దవటం మండలం టక్కోలి గ్రామ సమీపంలోని సర్వే నెంబరు 524లో రాష్ట్రస్థాయి లలిత కళల యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించి భూములను శనివారం కలెక్టర్‌ హరికిరణ్‌, జాయింట్‌ కలెక్టర్‌, సబ్‌కలెక్టర్‌లు పరిశీలించారు. దాదాపు 134 ఎకరాల విస్తీర్ణంలో యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. యూనివర్సిటీ ఏర్పాటుతో పాటు పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి కొండ ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. యూనివర్సిటీకి ప్రతిపాదించిన ప్లానలో ఎలాంటి ఆటంకాలు లేకుండా పర్యాటక అభివృద్ధికి, రాకపోకలకు ప్రతిపాదిత స్థలంలో తగిన మార్గాలు ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు.

యూనివర్సిటీ కోసం వీసీని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్‌ దాదాపు రెండు కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్లి స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కొండ ప్రాంతాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ గౌతమి, రాజంపేట సబ్‌కలెక్టర్‌ కేతనగార్గ్‌, స్టేట్‌ ఫైన ఆర్ట్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ విజయ్‌కిషోర్‌, రిజిస్ర్టార్‌ సురేందర్‌రెడ్డి, విజయవాడ ఏపీడబ్ల్యూఐడీసీఈఎస్‌ విజయ్‌కుమార్‌, ఈఈ జనార్ధనరెడ్డి, కడప తహసీల్దారు శివరాంరెడ్డి, సిద్దవటం తహసీల్దారు రమాకుమారి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-08T05:27:13+05:30 IST