-
-
Home » Andhra Pradesh » Kadapa » tulasi reddy spoke about YCP government
-
తప్పులు చేయడం కోర్టులతో అక్షింతలు వేయించుకోవడంవైసీపీకి అలవాటే : తులసిరెడ్డి
ABN , First Publish Date - 2020-03-24T10:38:51+05:30 IST
తప్పులు చేయడం కోర్టులతో అక్షింతలు వేయించుకోవడంవైసీపీకి అలవాటే : తులసిరెడ్డి

వేంపల్లె, మార్చి 23: తప్పులు చేయడం కోర్టులతో అక్షింతలు వేయించుకోవడం వైసీపీ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని పీసీసీ వ ర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్థించిందన్నారు. వెంటనే వైసీపీ రంగులను తొలగించాలని సుప్రీం కోర్టు ఆదేశించడమే ఇం దుకు నిదర్శనమని తెలిపారు.
రాజధాని ప్రాం తంలో గుంటూరు, విజయవాడ, దుగ్గిరాల, పెద్దకాకాని ప్రాంత రైతులకు సీఆర్డీయే చట్టానికి వ్యతిరేకంగా ఇళ్లస్థలాలు ఇస్తూ ప్రభుత్వం జారీచేసిన జీఓపై హైకోర్టు మద్యంతర ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై రాజధాని ప్రాంతం నుంచి విజిలెన్స్ కమిషన్, కమీషనరేట్ ఆఫ్ ఎంక్వై రీ కార్యాలయాల తరలింపు స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికల వా యిదా, ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడి యం రద్దు, వివేకానందరెడ్డి హత్యకేసు ద ర్యాప్తు వంటి అనేక అంశాల్లో కోర్టులు వైసీపీ ప్రభుత్వానికి అక్షింతలు వేశాయని ఆ ప్రకటనలో తెలిపారు.