ఉపాధ్యాయ బదిలీల్లో అర్హులకు అన్యాయం
ABN , First Publish Date - 2020-11-16T05:06:55+05:30 IST
ఉపాధ్యాయ బదిలీల్లో అర్హులైన ఉపాధ్యాయులకు అన్యాయం జరిగిందని రాష్ట్రోపాధ్యాయ సం ఘం రాష్ట్ర కౌన్సిలర్ గురుకుమార్ అన్నారు.

జమ్మలమడుగు రూరల్, నవంబరు 15: ఉపాధ్యాయ బదిలీల్లో అర్హులైన ఉపాధ్యాయులకు అన్యాయం జరిగిందని రాష్ట్రోపాధ్యాయ సం ఘం రాష్ట్ర కౌన్సిలర్ గురుకుమార్ అన్నారు. బదిలీ ఉత్తర్వులు సవరించాలని డిమాండ్ చేశారు. ఆదివారం జమ్మలమడుగులోని పెన్షనర్స్ భవనంలో ఎస్టీయూ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వేసవిలో బదిలీలు ప్రభు త్వం జరపాల్సి ఉండగా గత మూడేళ్లుగా బదిలీలు జరుపలేద న్నా రు. దీంతో పదేళ్ల నుంచి సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు ఎనిమిది సంవత్సరాలు పాయింట్లు ఇవ్వడం జరిగిందన్నారు. పాఠ శాల కేటగిరి మారినప్పుడు కూడా పాయింట్లు నష్టపోతున్నారని ప్రధానోపాధ్యాయులకు నష్టం జరుగుతోందన్నారు. మారుమూల ప్రాంత ఉపాధ్యాయులకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బదిలీల దరఖాస్తుకు గడువు పెంచాలి
ప్రొద్దుటూరు టౌన, నవంబరు 15: ఉపాధ్యాయ బదిలీలకు దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించాలని జాక్టో రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఉపాధ్యాయ సేవా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దీర్ఘకాలికంగా పనిచేస్తున్న ఉపాధ్యాయులకు 8, 5 సంవత్సరాల పాయింట్ సీలింగ్ ఎత్తివేయాలన్నారు. డీఈవో పూల్‌లో ఉన్న ఉపాధ్యాయులకు కొత్తగా ఏర్పాటు చేసిన ఉన్నత పాఠశాలల్లో సర్దుబాటు చేయాలన్నారు. బదిలీలకోసం ఆనలైనలో ఉన్న సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని కోరారు. కరోనా దృష్ట్యా వెబ్‌కౌన్సిలింగ్‌లో సాంకేతిక సమస్యలను దృష్టిలో ఉంచుకుని మాన్యువల్ విధానంలో బదిలీలకు కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో జాక్టో ప్రధాన కార్యదర్శి అంకాల్‌కొండయ్య, శ్రీధర్‌రెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.