-
-
Home » Andhra Pradesh » Kadapa » traffic rules
-
ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలి: డీఎస్పీ
ABN , First Publish Date - 2020-11-22T04:58:04+05:30 IST
వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కడప డీఎస్పీ సునీల్ సూచించారు. శనివారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ట్రాఫిక్ నిబంధనలను వివరించారు.

కడప (క్రైం), నవంబరు 21 : వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కడప డీఎస్పీ సునీల్ సూచించారు. శనివారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ట్రాఫిక్ నిబంధనలను వివరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా వాహనపత్రాలతో పాటు లైసెన్సు, ఇన్సూరెన్స్‌లే కాకుండా హెల్మెట్ తప్పక ధరించాలన్నారు. వా హనాలను ఎక్కడపడితే అక్కడ పార్కింగ్ చేయ రాదన్నారు. ప్రతిరోజూ వాహన తనిఖీలు చేపట్టి లైసెన్సు, ఆర్‌సీ, ఇన్సూరెన్స్ లేని వారికి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. పత్రాలు లేని వారివాహనాలు సీజ్ చేస్తామన్నారు. త్రిబుల్ రైడింగ్ చేస్తే కేసు నమోదు చేస్తామన్నారు. ఖాళీ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. రాత్రిళ్లు ఆటోలు నడిపేవారికి పోలీసుల అనుమతులు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ వాహనాలకు కంపెనీ సైలెన్సర్లు లేకుంటే సీజ్ చేస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. అలాగే ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రజలు సహకరించాలని కోరారు.