రెండు మోటారు బైకులు ఢీ - ఒకరు మృతి

ABN , First Publish Date - 2020-12-28T04:41:39+05:30 IST

అప్పయ్యరాజుపేట వద్ద రెండు బైకులు ఢీకొడంతో వెంకటరమణ(45) మృతి చెందాడు. పుల్లంపేట పోలీసుల కథనం మేరకు...

రెండు మోటారు బైకులు ఢీ - ఒకరు మృతి
మృతి చెందిన వెంకటరమణ

పుల్లంపేట, డిసెంబరు27: అప్పయ్యరాజుపేట వద్ద రెండు బైకులు ఢీకొడంతో వెంకటరమణ(45) మృతి చెందాడు. పుల్లంపేట పోలీసుల కథనం మేరకు... ఎగువరెడ్డిపల్లె దళితవాడ వాసి వెంకటరమణ అప్పయ్యరాజుపేట వద్ద ద్విచ క్రవాహనానికి పెట్రోలు పట్టించుకుని రోడ్డుపైకి వస్తుండగా పుల్లంపేట నుంచి కోడూరు వైపు వెళుతున్న కుమార్‌ బైకు ఢీకొంది. దీంతో వెంకటరమణ తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంకటరమణను చికిత్స నిమిత్తం రాజంపేట ఆస్పత్రికి తరిలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2020-12-28T04:41:39+05:30 IST