-
-
Home » Andhra Pradesh » Kadapa » today start kasinayana prayers
-
నేటి నుంచి కాశినాయన ఆరాధనోత్సవాలు
ABN , First Publish Date - 2020-12-29T05:18:54+05:30 IST
అవధూత కాశినాయన 25వ ఆరాధనోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభమవుతాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

కాశినాయన, డిసెంబరు 28: అవధూత కాశినాయన 25వ ఆరాధనోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభమవుతాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. కొవిడ్ నిబంధనలను అనుసరించి 29, 30 తేదీల్లో రెండు రోజులపాటు ఈ ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. మంగళవారం రాత్రికి జ్యోతి ప్రజ్వలన, రఽథోత్సవం, కాశినాయన మహాసమాధికి అహాషేకం ఉంటుంద న్నారు. రెండవరోజు బుధవారం రాత్రికి నిర్వహించే పల్లకి ఊరేగింపుతో ఉత్సవాలు పూర్తవుతాయని పేర్కొన్నారు. స్వాగత తోరణాలు, చ లువ పందిళ్లు ఏర్పాటు చేశారు. అన్నదానం వద్ద, కాశినాయన సమాధిని దర్శించుకునే ప్ర దేశంలో తొక్కిసలాట జరుగకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే దూరప్రాంతాలకు చెందిన పలువురు వలంటీర్లు జ్యోతీ క్షేత్రానికి చేరుకొని సేవలను అందిస్తున్నారు. గుంటూరు, ఒంగోలు, కర్నూలు తదితర జిల్లాల నుంచి ఉ త్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బ స్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ మైదుకూరు డిపోమేనేజర్ మోతీలాల్ నాయక్ తెలిపారు. పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఐ ఘనమద్దిలేటి తెలిపారు. వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు డాక్టర్ కిరణ్‌ప్రసాద్ తెలిపారు.