సమయ పాలన ముఖ్యం

ABN , First Publish Date - 2020-02-16T09:37:18+05:30 IST

పరీక్ష ల సమయంలో సమయపాలన ముఖ్యమని ఆర్జేడీ వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. శనివారం నగరలోని

సమయ పాలన ముఖ్యం

పది ప్రణాళికా పద్ధతిపై పర్యవేక్షణ

ఆర్‌జేడీ వెంకటకృష్ణారెడ్డి


కడప (స్పోర్ట్స్‌), ఫిబ్రవరి 15: పరీక్షల సమయంలో సమయపాలన ముఖ్యమని ఆర్జేడీ వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. శనివారం నగరలోని చెమ్మూమియాపేట ఉన్నత పాఠశా లను ఆయన సందర్శించారు. 2019- 20 పది ప్రణాళికా పద్ధతిపై పర్యవేక్షణ చేశారు. ఈ సందర్భంగా ముం దుగా ఆయన పదోతరగతి విద్యార్థులతో ముఖాముఖి అయ్యారు. పది పరీక్షల ప్రిపరేషన్‌ ఎలా జరగుతోం దని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నూతన ప్రశ్నాపద్ధతిని వివరించారు. అక్షరాలు గుండ్రంగా రా యడంతో పాటు ప్రతి ప్రశ్నకు సమాధానం రాసే విధంగా ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలని సూచించారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు.


పది ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత, 10కి పది పాయింట్లు సాధించేందుకు అమలు చేసే ప్రణాళిక విధానాలను సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అనంతరం ఆయన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించా రు. విద్యార్థులు తింటున్న భోజనం క్వాలిటీ, క్వాంటిటీ, అలాగే గుడ్లు, చిక్కి కేటాయించిన రోజుల్లో ఇస్తున్నా రా అని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మేరి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - 2020-02-16T09:37:18+05:30 IST