తుఫాను బాధితులను ఆదుకోవడంలో నిర్లక్ష్యం

ABN , First Publish Date - 2020-12-06T05:03:56+05:30 IST

తుఫాను బాధితులను ఆదుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి, బీజేపీ కిసాన్‌ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు వంగల శశిభూషణ్‌రెడ్డిలు వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

తుఫాను బాధితులను ఆదుకోవడంలో నిర్లక్ష్యం
ధర్నాలో మాట్లాడుతున్న ఆదినారాయణ రెడ్డి

బీజేపీ రాష్ట్ర నాయకులు ఆది, శశిభూషణ్‌రెడ్డి

కడప(మారుతీనగర్‌), డిసెంబరు 5: తుఫాను బాధితులను ఆదుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి, బీజేపీ కిసాన్‌ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు వంగల శశిభూషణ్‌రెడ్డిలు వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు శనివారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రం నుంచి వచ్చే నిధులతో సోకులు పోతూ రహదారులను విస్మరించిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రహదారులు గుంతలమయంగా మారి ప్రజల ప్రాణాలను హరించి వేస్తున్నాయని వాపోయారు. నివర్‌ తుఫాను కారణంగా రైతులు తీవ్ర నష్టాల పాలైనప్పటికీ వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు. తక్షణం వరద బాధితులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.  కార్యక్రమంలో బీజేపీ నాయకులు శ్రీనివాసులు (టైలర్‌), బండి ప్రభాకర్‌, లక్ష్మణరావు, మాజీ జిల్లా అధ్యక్షులు కుప్పాల శ్రీనాధరెడ్డి, సీనియర్‌ నాయకులు చలపతి, పెసల సాంబశివారెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-06T05:03:56+05:30 IST