ఇటు కరోనా భయం.. అటు వ్యాపారుల దోపిడీ

ABN , First Publish Date - 2020-03-24T10:41:56+05:30 IST

ప్రొద్దుటూరు రూరల్‌ పరిధిలోని విదే శాల నుంచి వచ్చిన వారిపై వైద్యాధికారు లు నిఘా ఉంచారు. విదేశాల నుండి ఏయే

ఇటు కరోనా భయం.. అటు వ్యాపారుల దోపిడీ

ప్రొద్దుటూరు రూరల్‌, మార్చి 23 : ప్రొద్దుటూరు రూరల్‌ పరిధిలోని విదే శాల నుంచి వచ్చిన వారిపై వైద్యాధికారు లు నిఘా ఉంచారు. విదేశాల నుండి ఏయే గ్రామాలకు వచ్చారో ఆ ప్రాంతంలోని వైద్యసిబ్బంది, గ్రామ వలంటీర్లు ద్వారా సమాచారం సేకరిస్తున్నారు. ఇప్పటికి కల్లూరు ప్రా థమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 39 మంది, కామనూరు ఆరోగ్య కేంద్రం పరిధిలో 38 మంది విదేశాల నుండి వచ్చినట్లు ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు శివప్రసాద్‌రెడ్డి, హనీ్‌ఫబాబాలు పేర్కొన్నారు. విదేశాల నుం డి వచ్చిన 77 మందికి కొన్ని జాగ్రత్తలు, సలహాలు, సూచనలతో కూడిన నోటీసులను ప్రభుత్వ వైద్యాధికారులు జారీ చేశారు. 

Read more