-
-
Home » Andhra Pradesh » Kadapa » There is no discrimination against HIV victims
-
హెచ్‌ఐవీ బాధితుల పట్ల వివక్ష తగదు
ABN , First Publish Date - 2020-05-18T11:21:49+05:30 IST
సమాజంలో హెచ్‌ఐవీ రోగుల పట్ల వివక్ష తగదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డా.ఉమాసుందరి పేర్కొన్నారు.

డీఎంఅండ్‌హెచ్‌ఓ ఉమాసుందరి
డీఎంఅండ్‌హెచ్‌ఓ ఉమాసుందరి
కడప(కలెక్టరేట్), మే 17: సమాజంలో హెచ్‌ఐవీ రోగుల పట్ల వివక్ష తగదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డా.ఉమాసుందరి పేర్కొన్నారు. అంతర్జాతీయ కొవ్వొత్తుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయంలో ఆదివారం వైద్య సిబ్బంది కొవ్వొత్తులు వెలిగించి మృతి చెందిన బాధితులకు అశ్రు నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీఎంఅండ్‌హెచ్‌ఓ ఉమాసుందరి, అదనపు డీఎంఅండ్‌హెచ్‌ఓ డా.ఖాధర్‌వల్లిలు మాట్లాడుతూ ఎయిడ్స్ బాధితులను మానవతా దృక్పథంతో చూడాలని, వారిపై చిన్నచూపు చూడడం తగదన్నారు. ఎయిడ్స్‌తో మృతి చెందిన వారి కుటుంబాలకు వారు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో డీఎన్ ఎంఓ డా.చిరంజీవి రెడ్డి, హెచ్‌వీఓ పి.గుణ శేఖర్, జగదీష్, పిటి.గుర్రప్ప, డీపీఎం వి.భాస్కర్, పీవి.ప్రసాద్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.