ప్రజల్లో అవగాహన అవసరం

ABN , First Publish Date - 2020-06-22T11:29:46+05:30 IST

కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా మాస్కులు ధరించేలా ప్రజలు అవగాహ న కలిగి ఉండాలని లేకుంటే జరిమానా తప్పదని అర్బన్‌ సీఐ

ప్రజల్లో అవగాహన అవసరం

పులివెందుల టౌన్‌, జూన్‌ 21: కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా మాస్కులు ధరించేలా ప్రజలు అవగాహ న కలిగి ఉండాలని లేకుంటే  జరిమానా తప్పదని  అర్బన్‌ సీఐ భాస్కర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ నరసింహారెడ్డిలు హెచ్చరించారు. ఆదివారం పట్టణంలోని ప్రధాన రహదారుల్లోని దుకాణవ్యాపారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాస్కులు ధరించని వారికి రూ. 500 జరిమానా విధించడంతోపాటు క్వారంటైన్‌కు తరలిస్తామన్నారు. అనంతరం మాస్కులు ధరించకుండా నిర్లక్ష్యంగా రోడ్లపై తిరుగుతున్న వారికి జరిమానా విధించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-06-22T11:29:46+05:30 IST