యువతి దారుణహత్య
ABN , First Publish Date - 2020-08-22T11:46:54+05:30 IST
స్థానిక రోటరీపుం వాసి వీరమ్మ (22) దారుణహత్యకు గురైంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి
పులివెందుల టౌన్, ఆగస్టు 21: స్థానిక రోటరీపుం వాసి వీరమ్మ (22) దారుణహత్యకు గురైంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అనంతపురం వాసి వీరమ్మకు మూడు నెలల కిందట రోటరీపురానికి చెందిన ఆంజనే యులుతో వివాహమైంది. అయితే ఆమెను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి స్థానిక శిల్పారామం వెనుక గుట్టలో పూడ్చి వేశారు. శుక్రవారం పోలీసులకు సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీ లించారు. దీనిపై పోలీ సులు వివరణ ఇస్తూ హత్య జరిగిన విషయం వాస్తవమేనన్నారు.