బుగ్గవంకలో పడి వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2020-12-27T05:07:42+05:30 IST

కడప నగరం ఎర్రముక్కపల్లె వాసి జి.భరతకుమార్‌ (29) బుగ్గవంకలో మునిగి మృతి చెందినట్లు తాలుకా పోలీసులు తెలిపారు.

బుగ్గవంకలో పడి వ్యక్తి మృతి
మృతదేహాన్ని బయటకు తీస్తున్న సిబ్బంది

కడప (క్రైం), డిసెంబరు 26: కడప నగరం ఎర్రముక్కపల్లె వాసి జి.భరతకుమార్‌ (29) బుగ్గవంకలో మునిగి మృతి చెందినట్లు తాలుకా పోలీసులు తెలిపారు. పోలీసు లు అందించిన వివరాల మేరకు... భరతకుమార్‌ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తు న్నాడు. శనివారం ఉదయం గేదెలను మేతకు వదిలి సొంత పని నిమిత్తం టౌనకు వ చ్చాడు.

ఇంటికి గేదెలు రాకపోవడంతో వాటిని వెతుక్కుంటూ వెళ్లాడు. కాగితాల పెంటలోని బుగ్గవంక బ్రిడ్జి కింద గేదెలు ఉన్నాయోమో చూసి కాల్వ దాటుతుండగా ప్రమాదవశాత్తూ కాల్వలోకి అడుగు పెట్టడంతో అతను పూర్తిగా మునిగి ఊపిరి ఆడక మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు కడప అగ్నిమాపక అధికారి బస్విరెడ్డి ఆధ్వర్యంలో ఫైర్‌సిబ్బంది, తాలుకా ఎస్‌ఐ హుసేన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహం వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.Updated Date - 2020-12-27T05:07:42+05:30 IST